మీడియేటర్స్ ఉంటారు అలర్ట్.. డ్రా తీసే డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు: మంత్రి కేటీఆర్

ఇల్లు.. అనేది చాలా ముఖ్యం.. ఇక సామాన్య మధ్య తరగతి వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకోసమే మిడిల్ క్లాస్ వారిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తుంటాయి. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దానిని విమర్శించిన టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇళ్లును నిర్మిస్తోంది. దఫాలు దఫాలుగా అర్హులకు అందజేస్తోంది. ఇవాళ బన్సిలాల్ పేటలో మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

 పత్రాల అందజేత..

పత్రాల అందజేత..

ఇల్లు కట్టించి ఇచ్చినా...ఆడబిడ్డ పెండ్లికి చేయూతను అందించినా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ సీసీ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటీఆర్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు కు సంబంధించిన పత్రాలను అందజేశారు. ముందుగా పొట్టి శ్రీరాములు నగర్‌లో ఇటీవల నిర్మించిన శ్రీ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీసీ నగర్ వరకు మంత్రి కేటీఆర్‌కు మహిళలు, హారతులు, బోనాలతో, పోతురాజుల నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

 18 వేల కోట్లు

18 వేల కోట్లు

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. పేదింటి ఆడపడుచుల పెళ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుందని, దేశంలోని ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలేదని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలను కేటాయించగా 11 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. మిగిలిన ఇండ్ల నిర్మాణం కూడా త్వరిగతిన పూర్తిచేసి లబ్దిదారులకు అందజేస్తామని చెప్పారు.

248 డబుల్ బెడ్ రూం ఇళ్లు

248 డబుల్ బెడ్ రూం ఇళ్లు

సిటీలో మరో 248 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. చాచా నెహ్రూనగర్‌లోని 3.35 ఎకరాల్లో రూ.19.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను నిర్మించారు. మౌలిక వసతులతో పాటు 50, 20 కిలోలీటర్ల నీటి సంపులను నిర్మించారు. కొందరు దళారులు మీకు ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పుతారని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. అలర్ట్‌గా ఉండాలని కేటీఆర్ సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటిలో ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఆలోచనతో లబ్దిదారులపై ఒక్క పైసా భారం లేకుండా ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+