వేసవి రాకముందే .. హైదరాబాద్ మార్కెట్లలో మామిడి పండ్ల సందడి
సీజన్ కంటే ముందుగానే మార్కెట్లలో మామిడిపండ్లు కనువిందు చేస్తున్నాయి . ఎప్పుడూ వేసవికాలంలో కనిపించే పండ్ల రారాజు మామిడి ఈసారి వేసవికాలం రాకముందే, సాధారణ సీజన్ కు దాదాపు రెండు నెలల ముందుగా మార్కెట్లోకి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలోని మార్కెట్లలో మామిడి పండ్లు అమ్మకానికి రావడంతో కొనుగోళ్లకు మామిడి ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చేపల కూర చిచ్చు : స్నేహితుడి హత్య , జైలుపాలైన ఏడుగురు

హైదరాబాద్ నగరంలో అప్పుడే కనిపిస్తున్న మామిడిపండ్లు
పండ్ల అమ్మకందారులు మామిడి పండ్ల ధరల ఆధారంగా కిలోకు రూ .100 నుండి 200 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. అయినప్పటికీ, మామిడి ప్రియులు సీజన్ కంటే ముందు వచ్చిన మామిడి పండ్లను ధరలను లెక్క చెయ్యకుండా తెగ కొనుగోలు చేస్తున్నారు . హైదరాబాద్ నగరంలో రిటైల్ గాను, రోడ్ల పక్కన మామిడి పండ్ల అమ్మకం అప్పుడే మొదలైంది. ఇక ఎర్రగడ్డ మార్కెట్లో వాటికి అధిక డిమాండ్ ఉందని చెబుతున్నారు .
కొంతమంది పండ్ల అమ్మకందారులు ఈ సీజన్‌లో పండ్లు బాగానే వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది కంటే ఈ ఏడాది బాగానే మామిడి కాత .. వ్యాపారుల ఆశాభావం
రాబోయే మామిడి సీజన్ పండ్ల ప్రారంభ రాక, గత సీజన్ కంటే మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా ప్రజలు, పండ్ల అమ్మకందారులు మామిడిపండ్ల గురించి మర్చిపోయారు. కానీ ఈ ఏడాది మామిడి పండ్ల విక్రయాలపై పండ్ల అమ్మకందారులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ధర ఎక్కువగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, సరఫరా మెరుగుపడి, నగరంలో ఎక్కువ స్టాక్స్ వచ్చాక , ధరలు పడిపోవటం ప్రారంభమవుతుందని వారంటున్నారు.

పండ్లు తక్కువ రావటంతో విపరీతంగా ధరల జోరు
హైదరాబాద్ లో సాధారణంగా మార్చి చివరిలో మామిడి మామిడి పండ్లు వస్తాయి. బెనిషన్, తోతాపారి, మరియు దశేరితో సహా పలు రకాల మామిడిపండ్లు సాధారణంగా మార్కెట్లో మొదట వస్తాయి. అయితే, నూజివీడు రకమే ఈసారి తొలిసారిగా కనిపించింది. ఇక గ్రేడ్ వన్ మామిడిపండ్లు కిలోకు రూ .200 వరకు అమ్ముడవుతున్నాయని, గ్రేడ్ టూ మామిడిపండ్లు కిలోకు రూ .100 నుంచి రూ .150 వరకు లభిస్తాయని విక్రేతలు తెలిపారు.

రెండు నెలల ముందే హైదరాబాదీలను పలకరిస్తున్న మామిడి పండ్లు
వేసవికాలంలో హైదరాబాద్ నగరంలో లభించే మామిడి పండ్లు ఎక్కువగా కొల్లాపూర్, అనంతపూర్, నూజివీడు, ఖమ్మం మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల నుండి వస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ సారి ముందుగానే వచ్చిన మామిడి పండు కాస్త ధర ఎక్కువగా ఉన్నా తియ్యగానే హైదరాబాద్ వాసులను పలకరిస్తోంది. మామిడి ప్రియులకు పసందైన రుచులను అందిస్తోంది. రేటు మాట ఎలా ఉన్నా మామిడి పండు రుచి చూడమని అప్పుడే పిలుస్తుంది .