Prostitution: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నిందితులపై పీడీ యాక్ట్..

హైదరాబాద్ నగరంలో పోలీసుల గస్తీ పెరగడంతో నగర శివారుల్లో అసాంఘీక కార్యకాలాపాలు పెరిగాయి. తాజాగా ఎవరికి తెలియకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ, తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చెందిన కసిరెడ్డి దొరబాబుతో కలిసి మీర్‌పేట టీకేఆర్‌ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొంత కాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత వ్యభిచారం చేయడం మొదలు పెట్టారు.

కొద్ది రోజులు ఎవరికి తెలియకుండా ఈ వ్యవహారం నడిచింది. చివరికి ఈ విషయం పోలీసులకు తెలియడంతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహం పై దాడి చేసి నిర్వహకులను పట్టుకున్నారు. భవానీ, కసిరెడ్డి దొరబాబు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వాట్సాప్ లో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

 Bhavani and Dorababu, who were operating prostitution in Mir Peta of Rangareddy district, were arrested by the police

విలాసాలకు అలవాటు పడిన భవానీ, దొరబాబు సులువుగా డబ్బు సంపాదించాలని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులు గంధ భవానీ, కసిరెడ్డి దొరబాబును అరెస్ట్‌ చేశారు. ఇద్దరు మహిళలను రక్షించి రక్షణ సెంటర్ కు తరలించారు. వారు భవిష్యత్తులో అసాంఘీక కార్యకాలాపాలకు పాల్పడకుండా రాచకొండ సీపీ మహేష్ భగవవత్ ఆదేశాల మేరకు భవానీ, దొరబాబుపై బుధవారం పీడీయాక్ట్‌ నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+