Bigg Boss Telugu 5: రెండో వారం కూడా మహిళా కంటెస్టెంటే అవుట్
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే రెండోవారంలోకి ఎంట్రీ అయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు కాస్త మోతాదు మించుతున్నట్టు అనిపిస్తోన్నప్పటికీ- స్పాంటేనియస్ స్పందిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. టాస్కుల్లో పాల్గొనే సమయంలో కంటెస్టెంట్లు.. తమ మధ్య ఉన్న స్నేహాన్ని సైతం మరిచిపోతున్నారు. శతృవుల్లా ఫైట్ చేస్తోన్నారు. ఈ క్రమంలో వారంతా కట్టు తప్పుతున్నారు. కోట్లాదిమంది వీక్షకులు తమను గమనిస్తున్నారనే విషయాన్ని మరిచిపోతున్నారు.

ఎలిమినేట్ అయ్యేదెవరు?
సెకెండ్ ఎలిమినేషన్ డే వచ్చేసింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ఎలిమినేషన్ కోసం మొత్తం ఏడు మంది సెలెక్ట్ అయ్యారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్ ప్రకారం.. నటరాజ్ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియాంక, యానీ మాస్టర్, శైలజ ప్రియ, ఉమాదేవి ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠతగా మారింది. అనవసరంగా అగ్రెసివ్ నెస్‌ను చూపించే కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చేలా ఈ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది.

ఆమె అవుట్..
లేటెస్ట్‌గా అందిన సమాచారాన్ని బట్టి చూస్తోంటే- ఫస్ట్ వీక్‌లోనే బిగ్‌బాస్ హౌస్ నుంచి సరయు ఎవిక్ట్ అయ్యారు. వరుసగా రెండో వారం కూడా మహిళా కంటెస్టెంట్‌నే బయటికి పంపుతారని సమాచారం. ఆ మహిళా కంటెస్టెంట్ ఉమాదేవి అని ప్రచారం జోరుగా సాగుతోంది. కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి ఈ వారం ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. వీక్షకుల నుంచి పెద్దగా ఆమెకు ఓట్లు రాలేదని, ఫలితంగా ఆమెను హౌస్ నుంచి బయటికి పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఉమాదేవి తరువాత అతి తక్కవ శాతం ఓట్లు నటరాజ్ మాస్టర్‌కు పోల్ అయ్యాయని అంటున్నారు.

చివరి వరకూ నటరాజ్ మాస్టర్, ఉమాదేవి..
నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ఎలిమినేషన్ చివరి రౌండ్ వరకు కొనసాగుతారు. వారిలో నటరాజ్ మాస్టర్ సేఫ్ జోన్‌లోకి వెళ్లగా.. ఉమాదేవి మాత్రం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే ప్రచారం ఉంది. సరయు.. బిగ్‌బాస్ హౌస్‌లో అగ్రెసివ్‌గా ప్రవర్తిస్తున్నారనే కారణాన్ని చెబుతున్నారు నెటిజన్లు. శనివారం నాటి ఎపిసోడ్‌లో ప్రత్యక్షమైన హోస్ట్ అక్కినేని నాగార్జున సైతం ఆమెకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెతో గుంజీలు తీయించారు. అనవసరంగా అగ్రెసివ్‌గా వ్యవహరించడాన్ని వీవర్స్ కూడా అంగీకరించట్లేదని, సింక్ కావట్లేదని చెబుతున్నారు.

నామినేషన్ టాస్క్‌లో
నామినేషన్ టాస్క్ సమయంలో ఉమాదేవి ఉపయోగించిన భాష పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయని అంటున్నారు. బూతులు ధారాళంగా మాట్లాడుతున్నారని, ఈ విషయంలో ఆమె కాస్త కట్టు తప్పినట్టు కనిపిస్తున్నారని చెబుతున్నారు. దీనివల్ల టోటల్ బిగ్‌బాస్ రియాలిటీ షోకే చెడ్డపేరు వస్తోందని సమాచారం. బిగ్‌బాస్ హౌస్‌లో బూతులు విపరీతంగా వినిపిస్తున్నాయంటూ నాగార్జున సైతం సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.

వారికి వార్నింగ్ ఇచ్చినట్టే
సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.. విమర్శలను గుప్పించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వారం- అగ్రెసివ్‌గా వ్యవహరిస్తోన్న ఉమాదేవిని ఎలిమినేట చేస్తారని ప్రచారం సాగుతోంది. నటరాజ్ మాస్టర్ సేఫ్‌జోన్‌కు వెళ్తారని చెబుతున్నారు. అసందర్భంగా అగ్రెసివ్‌నెస్‌ను ప్రదర్శిస్తోన్న కంటెస్టెంట్లకు ఓ వార్నింగ్ మెసేజీని పంపించినట్టవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications