Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తగ్గేదే లేదు - పైలట్ రోహిత్ రెడ్డి కీలక నిర్ణయం..!!

తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేదే లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేసారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో తననను ఇరికించేలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను దొంగను కాదని, ఎటువంటి విచారణకు అయినా సిద్దమని ప్రకటించారు. బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ తో పాటుగా తుషార్ ఎందుకు విచారణకు రావటం లేదని పైలట్ ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు విచారణకు రావటానికి భయం దేనికని వ్యాఖ్యానించారు. విచారణకు హాజరు కాకుండా స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇదే సమయంలో రోహిత్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఈడీ తనకు ఇచ్చిన నోటీసులు..విచారణ పైన కోర్టుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈడీ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేసారు. తనకు న్యాయ వ్యవస్ధపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. నందకుమార్ స్టేట్మెంట్ ద్వారా నన్ను కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు నాకు అనిపిస్తోందన్నారు. నందకుమార్ తో ఎలాంటి వ్యాపార, ఆర్ధిక లావాదేవీలు లేవని.. విచారణలో ఇవి తేలిందన్నారు. దీంతో కొత్త కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈడీ అధికారులు అకస్మాత్తుగా రూట్ మార్చి.. నందకుమార్ ను విచారించేది ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారని పేర్కొన్నారు.

BR MLA Pilot Rohit Reddy decided for legal Fight Against ED on MLAs poaching Case

మనీ లాండరింగ్ పైనే విచారించాలని పైలట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో హై స్పీడ్ లో వెళ్తున్న బీజేపీకి బ్రేకులు వేసామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం బీఆర్ఎస్ కు సంబంధించింది కాదని, తెలంగాణ ప్రజల సమస్యగా పేర్కొన్నారు. తనకు విచారణ సమయంలో అసలు తొలి రోజు ఏ కేసు గురించో విచారణ అనేది కూడా చెప్పలేదన్నారు. రెండో రోజు నిలదీస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు అని క్లారిటీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈడీ పరిధిలోకి ఈ కేసులో ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన తననే విచారించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ అరాచకాలకు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్ధలు అస్త్రాలుగా మారాయన్నారు. 27 న విచారణ కు హాజరవుతానని వెల్లడించారు. రెండు రోజుల విచారణలో తన దగ్గర ఏమీ దొరకలేదని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+