హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండెక్కిన కోడి.. చికెన్ ధరలకు రెక్కలు... కిలో రూ.300 వరకు...

|
Google Oneindia TeluguNews

చికెన్.. ముక్క లేనిది ముద్ద దిగదు కొందరికీ. కరోనా వల్ల చికెన్‌కు యమ గిరాకీ ఉంటోంది జనం చాలా మంది గుడ్లు, చికెన్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో డిష్‌లో చికెన్ కంపల్సరీ అయిపోయింది. డిమాండ్ ఉండటంతో ఆటోమెటిక్‌గా ధర కూడా ఎక్కువే ఉంటుంది. కిలో చికెన్ ధర రూ.280 వరకు ఉంటోంది. ఒక్కో చోట ఒకలా ధర ఉంటుంది. మినిమం కిలో చికెన్ ధర రూ.300 వరకు పలుకుతోంది.

కోడి ధరకు రెక్కలు

కోడి ధరకు రెక్కలు

ఎండలకు కోడి ధర కూడా పెరుగుతోంది. కోళ్లను పెంచడం కాస్త ఇబ్బందిగా మారుతోంది. కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతున్నాయి. దీంతో ధర పెంచక తప్పడం లేదు. ఇప్పుడే కాదు ఎండలు పెరిగే కొద్దీ ఇంకా ధర పెరుగుతుందని ఫౌల్ట్రీ ఫామ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు చికెన్‌కు డిమాండ్ పెరగడంతో సప్లై సరిపడం ఉండటం లేదు. అందుకే చికెన్ ధరకు రెక్కలు వచ్చాయి.

 మటన్, ఫిష్ ధర హై

మటన్, ఫిష్ ధర హై

మటన్ ధర స్వతహాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో సామాన్య ప్రజలు చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ దాని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే కొనుగోలు చేయాలంటే భయపడుతుంటారు. ఇటు ఫిష్ కూడా ఎక్కువగా కొందరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బొమ్మె, జెల్ల లాంటి ఫిష్ కూడా ధర ఎక్కువే పలుకుతోంది. దీంతో సామాన్యుడు కోడి వైపు మొగ్గు చూపాడు. కానీ అక్కడ కూడా చుక్కెదురు అయ్యింది.

కంట్రీ కోడి ధర కూడా

కంట్రీ కోడి ధర కూడా

బాయిలర్ కోడి ధరకు రెక్కలు రాగా.. ఇక కంట్రీ కోడి సంగతి చెప్పక్కర్లేదు. అదీ ఇప్పుడే రూ.500 వరకు ఉండగా.. మరింత పెరిగే అవకాశం ఉంది. రూ.600 వరకు ఉంటే.. సామాన్య జనం దానిని కొనుగోలు చేసే ధైర్యం చేయడం లేదు. దీంతో అందరూ బాయిలర్ కోడి వైపు చూస్తున్నారు. కానీ అదీ కూడా కొండెక్కడంతో జనం చికెన్ అంటేనే నో నో అంటున్నారు.

English summary
chicken rate high in telangana and andhra pradesh. kg rs 300 in the market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X