హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రావణ మాసంలో కూడా భారీగా నాన్ వెజ్ వాడకం.. చికెన్ ముక్కలేనిదే దిగని ముద్ద..

|
Google Oneindia TeluguNews

శ్రావణ మాసంలో నాన్‌వెజ్‌ వినియోగం తక్కువగా ఉంటుంది. ఈసారి మాత్రం చికెన్‌ వినియోగం మరింత పెరిగింది. గత కొంత కాలంగా చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. కానీ ప్రస్తుతం రిటైల్‌మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర 240 నుంచి 250 రూపాయలు పలుకుతోంది. గత ఏడాది శ్రావణ మాసంతో పోలిస్తే ధర దాదాపు 80 రూపాయలు ఎక్కువ. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చికెన్‌ ధరలు రిటైల్‌ మార్కెట్‌లో 140 నుంచి 160 రూపాయలు మాత్రమే పలికేవీ. ఈసారి మాత్రం కిలో 250 రూపాయలకు చేరింది. చికెన్‌ వినియోగం భారీగా పెరగడం వల్లనే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

పీవీ సింధుకి 'మెగా' సన్మానం: హాజరైన సినీ ప్రముఖులు (ఫోటోలు)పీవీ సింధుకి 'మెగా' సన్మానం: హాజరైన సినీ ప్రముఖులు (ఫోటోలు)

రూ.280 వరకు కిలో..

రూ.280 వరకు కిలో..

గత నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర 260 నుంచి 280 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం 250 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరంలో చికెన్‌ వినియోగం గత సంవత్సరంతో పోలిస్తే మూడురెట్లు ఎక్కువ ఉన్నట్టు హోల్‌సేల్‌ చికెన్‌ వ్యాపారులు తెలిపారు. ముఖ్యంగా కరోనా విజృంభణ సమయంలో చికెన్‌ వినియోగం బాగా పెరిగింది. చికెన్‌ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో నాన్‌వెజ్‌ ప్రియులు అధికంగా చికెన్‌ వైపు మళ్లారు.

పెళ్లిళ్ల వల్ల కూడా..

పెళ్లిళ్ల వల్ల కూడా..

శ్రావణ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్న కారణంగా కూడా వినియోగం అధికం కావడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణం వల్లే ఈ సారి ధరలు తగ్గడం లేదని చెబుతున్నారు. సాధారణ రోజుల్లో ఒక్కహైదరాబాద్‌లోనే రోజుకు లక్ష కేజీల చికెన్‌ వినియోగం జరుగుతుండగా, పండగలు, ప్రత్యేక సందర్బాల్లో వినియోగం రెట్టింపు అవుతుందని వ్యాపారులు చెప్పారు. ప్రస్తుతం చికెన్‌ వినియోగం రోజుకు 2.5 నుంచి 3 లక్షల కేజీలకు పెరిగిందని వ్యాపారులు తెలిపారు.

ఇవీ కారణాలు

ఇవీ కారణాలు

ఇంతగా చికెన్‌ వినియోగం పెరగడానికి మటన్‌ ధరలు పెరగడం మరో కారణంగా చెబుతున్నారు. మటన్‌ కొనుగోలు చేసే స్థోమత లేనివారు చికెన్‌కే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చికెన్‌ వినియోగం మరింత పెరిగే అవకాశం వుందని వ్యాపారుల అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫిష్ కూడా చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. రవ్ ఫిష్ ధర తక్కువే కానీ.. బొమ్మై, ఇతర చేపల ధర ఎక్కువగా ఉంటుంది.

రొయ్యల ధర అందుబాటులో ఉన్నా.. వేడి వల్ల చాలా తక్కువ మంది తీసుకుంటారు. పై కారణాల వల్ల చికెన్ వినియోగం పెరిగింది. అదీ కూడా బాయిలర్ చికెన్ కొనుగోలు చేస్తున్నారు. దేశీ కోడికి కూడా డిమాండ్ తక్కువే ఉంటుంది. దాని ధర కాస్త ఎక్కువగా ఉండటం.. పిష్ మెత్తగా ఉండకపోవడం కారణం అవుతుంది.

 నాన్ వెజ్ వినియోగం

నాన్ వెజ్ వినియోగం

కరోనా రాక ముందు శ్రావణ, కార్తీక మాసాల్లో నాన్ వెజ్ వినియోగం తక్కువగా ఉండేది. కానీ వైరస్ వల్ల ఆ సీన్ మారిపోయింది. ఎప్పుడూ ముక్క లేని ఇళ్లు ఉండటం లేదు. చికెన్/ మటన్ తిననివారు కూడా ఎగ్ తీసుకుంటున్నారు. ప్రొటీన్, విటమిన్ కోసం చికెన్ ముక్క నిత్య జీవితంలో కంపల్సరీ అయిపోయింది. కరోనా ఉన్నన్నీ రోజులు చికెన్ వ్యాపారానికి ఏ ఢోకా లేదు.

English summary
chicken use high in this sravana masam. last year kg chicken rate is rs140 to 160 but this year.. rs260 to 280 rupees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X