కేసీఆర్ గుండె మాత్రం కరగడం లేదు: వైఎస్ షర్మిల విసుర్లు

సమయం దొరికితే చాలు.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ నిరాహార దీక్ష కూడా చేయడం లేదు. కానీ ప్రభుత్వం చేసే తప్పులను మాత్రం ఎత్తి చూపుతున్నారు. కేసీఆర్‌ సర్కార్‌ పై వైఎస్‌ షర్మిల మరోసారి ఫైర్‌ అయ్యారు. ధాన్యం కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి కానీ మీ గుండెలు కరుగటం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు.. తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవా ? అంటూ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే, మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్‌ షర్మిల. ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి కానీ... కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదు. కొనేది లేదని నిప్పులు చెరిగారు. అకాల వర్షాలకు పండిన పంట తడిసిపోయి మొలకలస్తుంటే, కష్ట పడి పండించిన పంట కండ్ల ముందు కొట్టుకుపోతుంటే, మొలకలొచ్చిన నారు వేసుకోవాలో పారబోసుకోవాలో కొంటారో కొనరో తెలియక" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 cm kcr not sympathy to farmers:ys sharmila

అంతకుముందు కేసీఆర్‌పై షర్మిల విరుచుకుపడ్డారు. ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే..? లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు. లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారని అడిగారు. ఇంకో 80 వేలు మళ్లీ ఇచ్చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. 80 వేల ఉద్యోగాలు ఏమిటి..? పీఆర్సీ ప్రకారం 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం లక్ష 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం లక్ష 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలకు కూడా కేంద్రమే ఆలస్యం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నాడు.

Recommended Video

    AP 3 Capitals లేనట్టేనా... ఇప్పటికి లేనట్టా ?? Jagan ప్లాన్ ? || Oneindia Telugu

    అయ్యా కేసీఆర్ కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసి 4 ఏండ్లు అయిపోయింది కదా..? ఇప్పటి వరకు మీరు దానికి కావాల్సిన నోటిఫికేషన్లు, సిబ్బందిని ఎందుకు భర్తీ చేయలేదు అని అడిగారు. ఆలస్యం చేస్తున్నది మీరా..ఇంకెవరైనా..? ఉద్యోగాలు ఇవ్వాలని మీకు సోయి ఉంటే వీల్లందరికీ ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు కనుకనే కదా..ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. కేసీఆర్ పాలనలో డిగ్రీలు, పీజీలు చదివిన నిరుద్యోగులు హమాలీ పని, పత్తి కూలీకి, ఆటో తోలుతూ పనులు చేసుకుంటున్నారు. 8 వేలకు ఆటో డ్రైవర్లుగా పోతున్నారు. ఇందుకేనా డిగ్రీలు, పీజీలు చదివింది..? కూలీ నాలీ చేసి వారిని కష్టపడి చదివించుకుంది ఇందుకేనా..? అప్పులు చేసి వారిని చదివించుకుంది హమాలీ పనికి పంపేందుకేనా..? మన పిల్లలు హమాలీ పనిచేయాలని మంత్రి కూడా అదే చెబుతున్నాడు. అంటే మన పిల్లలు హమాలీ పని చేసుకోవాలి. కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలని ఫైరయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+