Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలకృష్ణ డైలాగ్ ట్వీట్ చేసిన సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు.. ఆ ఫోటోతో హల్చల్

తెలంగాణ సీఎం కెసిఆర్ మనవడు, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు సోషల్ మీడియాలో తండ్రిలానే యాక్టివ్ గా ఉంటారు. ఇక తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ ను చూసి షాక్ ట్వీట్ చేసిన నెటిజన్ ట్వీట్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. బాలకృష్ణ డైలాగ్ ను కోట్ చేస్తూ హిమాన్షు ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

బాలకృష్ణ డైలాగ్ ను కోట్ చేసి చేసిన ట్వీట్


తన శరీరాకృతి పై దృష్టి పెట్టిన హిమాన్షు రావు ఫిట్నెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చాలా బరువు తగ్గారు. ఇక ఇదే క్రమంలో తాజాగా ఒక నెటిజన్ హిమాన్షు రావు ఇటీవల దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసి, సడన్ గా చూసి కేటీఆర్ అన్న అనుకున్నా అంటూ ఆ ఫోటో క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. ఇక ఆ పోస్టు చూసి హిమాన్షు బాలకృష్ణ డైలాగ్ ను కోట్ చేసి సదరు నెటిజన్ కు సమాధానమిచ్చారు. ఇక అందులో హిమాన్షు రావు సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ఏంటీ అని ఒక మహానుభావుడు చెప్పాడని పేరుకొని, సరే జోకులు తర్వాత... ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.

హిమాన్షు తాజా ఫోటో పై నెటిజన్లు షాక్.. రహస్యం ఏంటని అడిగిన నెటిజన్లు

హిమాన్షు తాజా ఫోటో పై నెటిజన్లు షాక్.. రహస్యం ఏంటని అడిగిన నెటిజన్లు

ఒక హిమాన్షు తాజా ఫోటో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజంగానే హిమాన్షు సేమ్ టు సేమ్ కేటీఆర్ లాగే ఉన్నారంటూ కామెంట్ చేశారు. హిమాన్షు పోస్టుకు నెటిజన్లు లైకులు కొడుతున్నారు. రీట్వీట్ లు చేస్తున్నారు. అంతేకాదు హిమాన్షు ఇంత గా మారడం వెనుక ఉన్న ఈ రహస్యాన్ని తమకు కూడా చెప్పాలని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

హిమాన్షు రావు బాడీ షేమింగ్.. అప్పట్లో రగడ

హిమాన్షు రావు... మంత్రి కేటీఆర్ తనయుడు. అనేక సందర్భాల్లో అధిక బరువు కారణంగా బాడీ షేమింగ్ కు గురయ్యారు. చాలా భారీ శరీరాకృతితో ఉన్న హిమాన్షు రావును చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీల నేతలు చాలా సందర్భాలలో హిమాన్షు శరీరాకృతి గురించి వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో తీవ్రంగా స్పందించారు. బహిరంగంగానే కుమారుడి బాడీ షేమింగ్ పై చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+