నరసింహన్‌కు ప్రగతిభవన్‌లో ఆత్మీయ వీడ్కోలు ..
హైదరాబాద్ : ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు.. అదీ కూడా గవర్నర్‌గా .. యూపీఏ హయాంలో నియమితులై .. ఎన్డీఏ తొలి దఫా కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొన్నారు. ఇటీవలే తమిళ సై సౌందరరాజన్ గవర్నర్‌గా నియమితులవడంతో గవర్నర్ నరసింహన్ దంపతులకు ప్రగతిభవన్‌లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.
వీడ్కోలు సభకు గవర్నర్ దంపతులు, సీఎం కేసీఆర్ దంపతులు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లను మాత్రమే ఆహ్వానించారు. ఆదివారం కొత్త గవర్నర్ నియమితులు కానున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రగతి భవన్‌లో గవర్నర్ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. సీఎం కేసీఆర్ గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు.

గవర్నర్ దంపతులకు శాలువాకప్పి పుష్పగుచ్చం అంజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఉపాధ్యక్షుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. తర్వాత బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు వీడ్కోలు పలికారు. విమానం వద్దకు సీఎం కేసీఆర్, మంత్రులు, డీజీపీ తదితరులు వచ్చి వీడ్కోలు పలికారు.












Click it and Unblock the Notifications