హుజూర్ నగర్ లో గెలుపు కోసం టీఆర్ఎస్ చేసినవి ఏ టూ జెడ్ అక్రమాలే : పొన్నం ప్రభాకర్

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని వారు ఆరోపిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీని ఓడించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీ మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. ఇక టిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించిన నేతలు విజయం తమదేనని భావించారు.

హుజూర్ నగర్ ఉపఎన్నికలో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఉపఎన్నికలో ఘోర పరాభవం పాలైంది కాంగ్రెస్ పార్టీ . దీంతో, కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇది నైతికంగా గెలుపు కాదని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక ఓటమితో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, ధనస్వామ్యం గెలిచినట్టుగా భావిస్తున్నామని అన్నారు. అంతే కాదు అధికార టీఆర్ ఎస్ ఏ టూ జెడ్ అక్రమాలకూ పాల్పడింది అని ఆయన మండిపడ్డారు.

 Congress leader ponnam prabhakar alleges Atoz irregularities in Huzurnagar by poll

ఈ ఎన్నికలో తాము ఓడిపోయామని తాను ఇలాంటివ్యాఖ్యలు చేయడం లేదని పేర్కొన్న పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ ఏ టూ జెడ్ అక్రమాలకు పాల్పడింది అని ఆరోపించారు. ఇక అధికార పార్టీ చేశున్న అక్రమాలపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనప్పటికీ, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని ఆయన అభిప్రాయం వ్వ్యక్తం చేశారు. ఇక ఈ ఎనీకల ఫలితాల ప్రభావం భవిష్యత్ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై ఉండదని పొన్నం అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+