గచ్చిబౌలి టిమ్స్‌లో పూర్తిస్థాయి కరోనా వైద్యం: మందుల కంటే ఆక్సిజనే ముఖ్యం: ఈటెల
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగుల కోసం గాంధీ ఆస్పత్రి ప్రత్యేకంగా పనిచేస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను కూడా కరోనా ఆస్పత్రిగా మార్చాయని, ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

టిమ్స్‌లో పూర్తిస్థాయి కరోనా వైద్యం..
ఆదివారం టిమ్స్‌ను మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటీన్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టిమ్స్‌లో 1350 బెడ్ల సౌకర్యం ఉందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్లతో కూడిన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.

కరోనా సోకితే ఆలస్యం చేయొద్దు..
రోగుల భద్రత, నర్సింగ్ సిబ్బంది, ఔషధాలను కూడా సమకూరుస్తామని వెల్లడించారు. లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో చేరాలని, కొందరు నాలుగైదు రోజుల ఆలస్యం చేస్తున్నారని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి, శ్వాస ఇబ్బంది కలిగితే తక్షణమే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే వందశాతం కరోనా బారి నుంచి బయటపడతారని స్పష్టం చేశారు.

కరోనా వైద్యం ఖరీదైనది కాదు..
కరోనా చికిత్స ఖరీదైనది కాదని, ఆక్సిజన్, మందులన్నీ కలిపితే కూడా రూ. 10వేలు మించి కాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రోజుకు లక్ష, రెండు లక్షలు ఖర్చు అయ్యే చికిత్స అసలు లేదని చెప్పారు. బాధ్యతారహితంగా వ్యవహరించి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో ఐసీయూ, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Recommended Video

కరోనా చికిత్సలో మందుల కంటే ఆక్సిజనే ముఖ్యం..
హైదరాబాద్ నగరంలోని చెస్ట్, ఫీవర్ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆస్పత్రిలో కావాల్సినన్ని బెడ్లు ఉన్నాయని మంత్రి ఈటెల తెలిపారు. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు దొరికినా దొరక్కపోయినా ఇబ్బంది ఉండదన్నారు. టిమ్స్, సరోజిని కంటి ఆస్పత్రి, కింగ్ కోఠి, ఫీవర్ ఆస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటెల తెలిపారు. కరోనా రోగికి మందుల కంటే ఆక్సిజన్ చాలా ముఖ్యమని, ఆగస్టు 10లోగా లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి ఈటెల రాజేందర్ వివరించారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications