• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్ ఫ్రంట్ పై సీపీఐ ఫైర్..! మోదీకి మేలు చేసేందేకే టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలంటున్న సుర‌వ‌రం..!!

|

హైదరాబాద్ : తెలంగాణ లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పైన , గులాబీ పార్టీ విజ‌యంపైన‌, ప్ర‌తిప‌క్షాలు ఎన్నిక‌ల్లో వ్య‌వ‌హ‌రించిన విధానల పైన సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి స్పందించారు. విచ్చ‌ల విడిగా డ‌బ్బు ఖర్చు చేయడం, అదికార ద్రుర్వినియోగానికి పాల్పడడంతోనే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని ఆయన విశ్లేంషించారు. జాతీయ రాజకీయాల్లో మూడవ కూటమికి ప్రయత్నిస్తున్న చంద్రశేఖర్ రావు చివరికి ప్రధాని మోదీకి మేలు జరిగే విధంగా వ్యవహరిస్తారు తప్ప మరోటి ఉండదని తేల్చి చెప్పారు సురవరం.

త్వ‌ర‌లో కేటీఆర్ కు తెలంగాణ పూర్తి బాద్య‌త‌లు..! నిర్థారిస్తున్న ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు..!

కేసీఆర్ ఫ్రంట్ ప‌ట్ల వెద‌వి విరుస్తున్న సీపీఐ..! మోదీ ని బ‌ల‌ప‌రిచేందుకు అంటున్న సుర‌వ‌రం..!

కేసీఆర్ ఫ్రంట్ ప‌ట్ల వెద‌వి విరుస్తున్న సీపీఐ..! మోదీ ని బ‌ల‌ప‌రిచేందుకు అంటున్న సుర‌వ‌రం..!

తెలంగాణ‌ ఎన్నికలు అయిపోయాక కేసీఆర్ కొత్త యాత్ర ప్రారంభించార‌ని సీపిఐ మండిప‌డుతోంది. థ‌ర్డ్ ఫ్రంట్ గురించి కేసీఆర్ చెప్పిందానికి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ చెప్పిందానికి పొంత‌న నేద‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విశ్లేషిస్తున్నారు. మమతా కూడా కాంగ్రెసేతర కూటమి సాధ్యంకాదని చెప్పారని. యాత్ర అనంతరం కేసీఆర్ ప్రధాని మోదిని కలిసి తన పర్యటన వివరాలు వినిపిస్తార‌ని అన్నారు. మిగతా ముఖ్యమంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వని మోది కేసీఆర్ కి ఇవ్వడంలోనే వారి సాన్నిహ‌త్యం ఎంతుందో అర్ధమవుతోంద‌ని సుర‌వ‌రం తెలిపారు.

కూట‌మి ఓట‌మికి కార‌ణాలు చెప్పిన సుర‌వ‌వ‌రం..! టీఆర్ఎస్ అదికార దుర్వినియోగానికి పాల్ప‌డింద‌ని ఆరోప‌ణ‌..!

కూట‌మి ఓట‌మికి కార‌ణాలు చెప్పిన సుర‌వ‌వ‌రం..! టీఆర్ఎస్ అదికార దుర్వినియోగానికి పాల్ప‌డింద‌ని ఆరోప‌ణ‌..!

కొద్దిసేప‌టి క్రితం మఖ్దూం భవన్ లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో వ‌క్తలు కేటీఆర్ ప‌ర్య‌ట‌న ప‌ట్ల త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు. మోది వ్యతిరేక ఓటును చీల్చడానికి కేసీఆర్ పని చేస్తున్నారని, బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ ఫ్రంట్ అంటున్నారని, ప్రధాని ఆర్థిక విధానాలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నా కేసీఆర్ కు ప‌ట్ట‌ద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్, ప్రధాన ఆర్థిక సలహాదారులు రాజీనామా ఎందుకు చేసారో కేంద్ర ప్ర‌భుత్వం చెప్ప‌గ‌ల‌దా అని ప్ర‌శ్నించారు. స్వతంత్ర సంస్థలైన సీబీఐ లాంటి వాటిని నిర్వీర్యం చేసేందుకు మోది చర్యలు ఉన్నాయని. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ను తప్పించుకునేందుకు గోరక్షక దళాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఘాటుగా విమ‌ర్శించారు.

అన్నీ అక్ర‌మాలే..! అందుకే టీఆర్ఎస్ గెలిచింద‌న్న సీపిఐ..!!

అన్నీ అక్ర‌మాలే..! అందుకే టీఆర్ఎస్ గెలిచింద‌న్న సీపిఐ..!!

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కి ఎదురు దెబ్బ తగిలిందని, తెలంగాణలో టీఆర్ఎస్ అనూహ్యంగా గెలిచిందని అన్నారు. నాలుగు పార్టీలు కలిసినా టీఆర్ఎస్ ని ఓడించలేకపోవ‌డానికి . అనేక కారణాలు ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీత‌ల వ‌ల్లే టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు సుర‌వ‌రం. రైతుల ఖాతాల్లో నగదు పోలింగ్ కి ముందు జమ చేశారని, 54 లక్షల రైతులు లబ్ది పొందడం ఆ పార్టీకి కలిసి వచ్చిందని. టీడీపీ తో పొత్తు కూడా టిఆర్ఎస్ కి లాభించిందని అన్నారు.

ప్ర‌జా స్వామ్యంలో ఓట‌మి స‌హ‌జం..! పార్టీ శ్రేణుల్లో భ‌రోసా నింపిన సుధాక‌ర్ రెడ్డి..!

ప్ర‌జా స్వామ్యంలో ఓట‌మి స‌హ‌జం..! పార్టీ శ్రేణుల్లో భ‌రోసా నింపిన సుధాక‌ర్ రెడ్డి..!

ఆంధ్రుల పెత్తనం ఉంటుందని ప్రజల్లో భయాందోళనలు కలిగించి టీఆర్ఎస్ విజయం సాధించిందని సుర‌వ‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఆ విషయాలను ప్రజలకు చెరవేయడంలో ప్రతిపక్షాలు విఫలం అయ్యాయని గులాబీ పార్టీ విజ‌యం అక్క‌డే నిర్ధార‌ణ అయ్యింద‌ని చెప్పారు. డబ్బు ప్రవాహం నీళ్ల‌లా సాగిందని ఎన్నికల కమిషన్ వందల కోట్లు పట్టుకుందని అన్నారు. ఓటమికి సీపీఐ కార్యకర్తలు నిరాశ పడొద్దు అని సురవరం నైతిక స్తైర్యం నింపే ప్ర‌య‌త్నం చేసారు.

English summary
After the Telangana election, the CPI allegating on trs that kcr is keen to launch a new tour. CPI national secretary Suravaram Sudhakar Reddy said that the Odisha CM Naveen Patnaik is keen to say KCR about the third front. Mamata also said that the non-Congress alliance was not possible. After traveling, KCR will meet Prime Minister Mudini and explains his visit details. suravaram said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X