హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదేళ్లుగా ప్రేమ.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెళ్లి, తండ్రి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది: నాగరాజు భార్య

|
Google Oneindia TeluguNews

నాగరాజు హత్య కేసు ప్రకంపనలు రేపుతోంది. నిందితులను శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా నిందితులను శిక్షించాలని కోరారు. నాగరాజు భార్య మీడియా ముందుకు వచ్చారు. తన భర్త నాగరాజును చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని నాగరాజు డిమాండ్‌ చేశారు. తమ పెళ్లి సోదరులకు ఇష్టం లేదని.. అందుకే తన భర్తను హత్య చేశారన్నారు. తాను ఎప్పటికీ పుట్టింటికి వెళ్లబోనని స్పష్టంచేసింది.

తమ ప్రేమ గురించి తన అమ్మకి చెప్పానని పేర్కొన్నారు. నాగరాజుతో ఫోన్ లో మాట్లాడిందని.. ఫోన్‌లో మాట్లాడానని తన అన్నయ్య తనను బాగా కొట్టాడని వెల్లడించారు. నచ్చచెప్పడానికి ప్రయత్నించానని అన్నయ్య అస్సలు వినలేదన్నారు. జనవరి 30వ తేదీన రోజు ఇంట్లో నుండి వచ్చేశానని చెప్పారు. 31వ తేదీన నాగరాజు, తాను పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. పదేళ్లుగా ప్రేమించుకున్నామని తెలిపారు. నాన్న ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండేదన్నారు. ఫాస్ట్రాక్ కోర్ట్ ద్వారా అన్న, బావకి శిక్ష పడాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన కొడుకును దారుణంగా హత్య చేశారని నాగరాజు తల్లి అనుసుజ వాపోయారు. కుమారుడిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

culprits to be punished strictly:nagaraju wife

తన సోదరి అశ్రిన్ సుల్తానాను పెళ్లి చేసుకున్నాడనే కక్షతో నాగరాజును చంపాలని ఆమె సోదరులు నిర్ణయం తీసుకున్నారు. అతనికి తెలియకుండా మొబైల్‌లో స్పై‌వేర్ యాప్ ఇన్‌స్టాల్ చేశారు. అతని కదలికలు ఎప్పటికప్పుడు గమనించేవారు. నాగరాజు హత్యకు నిందితుడు ముందుగానే స్కెచ్ వేసుకున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో అదీ ఆలస్యమైంది. పండగ ముగియగా.. స్కెచ్‌ ప్రకారం రంగంలోకి దిగారు. 4వ తేదీన రాత్రి బైక్‌పై అశ్రిన్‌తో కలిసి వెళ్తున్న నాగరాజును నిందితుడు దాడి చేసి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై చంపేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ త్వరగా జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాల్సి ఉంది.

English summary
culprits to be punished strictly nagaraju wife ashreen demanded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X