హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొవ్వు తగ్గిస్తానని చెప్పి డ్యాన్స్ స్కూల్ నిర్వాహకుడు ఏం చేశాడో తెలుసా ? ఆ తర్వాత జరిగిందిదే !!

|
Google Oneindia TeluguNews

శారీరక వ్యాయామం లేదని, బరువు బాగా పెరుగుతున్నారని కాస్త బరువు తగ్గించాలని చాలామంది తమ పిల్లల్ని జిమ్ సెంటర్లకు, డాన్స్ స్కూల్ లకు పంపిస్తున్నారు. అయితే డాన్స్ స్కూల్ లో కొవ్వు తగ్గించే మాట అటుంచి, కొందరు పిల్లల పట్ల నిర్వాహకులు , లేదా సదరు సెంటర్లకు వచ్చే వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిర్వాహకుడు

బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిర్వాహకుడు

తిరుమలగిరి దుర్గ విహార్ కాలనీలో నివాసముండే బాలిక బోయిన్ పల్లి మార్కెట్ సమీపంలో అర్బన్ డాన్స్ వరల్డ్ లో గత కొద్ది రోజులుగా డాన్స్ శిక్షణ తీసుకుంటుంది. డాన్స్ చేయడం వల్ల శారీరక వ్యాయామం కలుగుతుందని, బాలిక శరీరాకృతి కూడా చాలా చక్కగా మారుతుందని, నడుము దగ్గర కొవ్వు తగ్గిస్తామని చెప్పి బాలికను తమ డాన్స్ స్కూల్లో జాయిన్ చేసుకున్న నిర్వాహకుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు దాంతో స్కూల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు.

బాలికపై కన్నేసిన నిర్వాహకుడు .. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పేరుతో

బాలికపై కన్నేసిన నిర్వాహకుడు .. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పేరుతో

ఇన్ స్పెక్టర్ రవికుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం డాన్స్ స్కూల్ నిర్వాహకుడు తిరుమలగిరి దుర్గా విహార్ కాలనీ లో నివాసముండే బాలికను బరువు తగ్గిస్తానని చెప్పి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు తన డాన్స్ క్లాస్ సెషన్ లో వర్కౌట్ కి రావలసిందిగా సూచించాడు. దీంతో గత నెల 26వ తేదీ నుండి ఉదయం సమయంలో బాలిక వర్కౌట్స్ కు వెళుతోంది. తాను శిక్షణ ఇచ్చే శిక్షణ కు సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలని బాలిక సూచించిన సదరు నిర్వాహకుడు బాలికపై కన్నేశాడు.

గదిలోకి తీసుకెళ్ళి బాలికపై అసభ్య ప్రవర్తన .. తల్లిదండ్రులకు చెప్పిన బాలిక

గదిలోకి తీసుకెళ్ళి బాలికపై అసభ్య ప్రవర్తన .. తల్లిదండ్రులకు చెప్పిన బాలిక

ఆ పేరుతో బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు . అయితే బాలిక ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళాక కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు 100 కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు సదరు డాన్స్ స్కూల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
అయితే తాను బాలికపై ఎలాంటి అఘాయిత్యం చెయ్యలేదని సదరు నిర్వాహకుడు బుకాయిస్తుండటం గమనార్హం .

జిమ్ సెంటర్ లు , డ్యాన్స్ స్కూల్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త

జిమ్ సెంటర్ లు , డ్యాన్స్ స్కూల్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త


కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ తో , ఆ తరువాత స్కూళ్లు, కళాశాలలు సరిగా నిర్వహించగా విద్యార్థులలో బరువు పెరగడం సమస్యగా మారింది. దీంతో చాలామంది తల్లిదండ్రులు వారిని జిమ్ లకు , డాన్స్ స్కూల్స్ కు పంపిస్తూ బరువు తగ్గించాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలను పంపిస్తున్న డాన్స్ స్కూల్స్, జిమ్ సెంటర్ల నిర్వాహకుల ప్రవర్తనను కూడా తల్లిదండ్రులు గమనించాల్సి ఉంది . వివిధ సెంటర్లలో ట్రైనింగ్ కి వెళుతున్న చిన్నారులు సైతం తమకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం ఉంది .

English summary
The girl, a resident of Durga Vihar Colony, Thirumalagiri, has been undergoing dance training at Urban Dance World near Boina Palli Market for the past few days. The manager who joined the girl at their dance school behaved vulgar towards her, saying that he wants to reduce her belly fat. The police registered a case against the dance school trainer and arrested him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X