DB Stock Broking: హైదరాబాద్ లో రూ.7000 కోట్ల మోసం..!
హైదరాబాద్‌లో మరో కుంభకోణం బయటపడింది. డిబి స్టాక్ బ్రోకింగ్‌కు సంబంధించిన ఈ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీ పెట్టుబడిదారులను రూ. 7,000 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు వచ్చాయి. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ బాధితుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులతో కేసు నమోదు చేసింది. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, గౌహతి వంటి ప్రధాన నగరాల్లో కూడా కార్యకాలాపాలు కొనసాగిస్తోంది.
డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ 2018 నుంచి పనిచేస్తోంది. ఈ కంపెనీ పెట్టుబడులపై భారీ లాభాలు అందిస్తామని పెట్టుబడిదారులను ఆకర్షించింది. భారీ మొత్తంలో డబ్బును సేకరించింది. మొదట్లో కొంత మందికి అధిక వడ్డీ చెల్లింపులు చేసింది. దీంతో చాలా మంది ఆకర్షితులై పెట్టుబడి పెట్టారు. కంపెనీ జూలై 2024 నుంచి పెట్టుబడిదారులు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో పెట్టుబడిదారుల నుంచి కంపెనీపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే కంపెనీ ఛైర్మన్ దీపాంకర్ బర్మన్ దేశం విడిచి వెళ్లినట్లు తెలిసింది.

దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ ఛైర్మన్ దీపాంకర్ బర్మన్‌తో పాటు పలువురు అసోసియేట్‌లపై నేరారోపణలు, నమ్మక ద్రోహం, మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. ఆగస్ట్ 21, 2024న దేశం నుంచి పారిపోయిన బర్మాన్ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు సమాచారం. ఈ కేసులో మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉంది. మోసపోయిన బాధితులు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
పోలీసుల విచారణకు తోడు అదనంగా, తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద విచారణ జరుగుతోంది.సంస్థ వార్షిక రాబడి 120%, ఆరు నెలల రాబడి 54%, నెలవారీ రాబడి 8%తో పథకాలను అందించిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇవన్నీ ఫేక్ నివేదికలన తెలుస్తోంది.తను డీబీ స్టాక్ బ్రోకింగ్ లో రూ.11 లక్షల పెట్టుబడి పెట్టినట్లు ఓ బాధితుడు చెప్పాడు. ఆ తర్వాత తనకు ఎలాంటి రాబడులు రాలేదని వాపోయాడు.












Click it and Unblock the Notifications