ఆ వాలంటీర్ కోవాక్సిన్ తీసుకోవడం వల్ల చనిపోలేదు: భారత్ బయోటెక్
కోవాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌లో భాగంగా ఓ వాలంటీర్ చనిపోయారనే వార్తలు వచ్చాయి. కోవాక్సిన్‌ను ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ రూపొందిస్తోంది. డిసెంబర్ 21వ తేదన ఓ వాలంటరీ చనిపోయారు. పీపుల్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో తుది శ్వాస విడిచారు. ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు.

చనిపోయిన వ్యక్తి నమూనాలను పరీక్షించాలని.. ఈ ఘటనను చాలా సున్నితంగా తీసుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. లేదంటే వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. వాలంటీర్ మృతికి సంబంధించి సమాచారం తెలుస్తోందని.. అందుకు 24 గంటల నుంచి రెండు, మూడురోజుల సమయం పడుతోందని చెప్పారు.
గాంధీ మెడికల్ కాలేజీ పోస్టు మార్టం రిపోర్ట్ ప్రకారం వాలంటీర్ విష ప్రయోగం వల్ల కార్డియో రెస్పిరేటరీ విఫలమైందని తెలిపారు. అందుకోసమే చనిపోయారని.. దీనికి సంబంధించి విచారణ కూడా జరుగుతుందని చెప్పారు. 9 రోజుల తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు.












Click it and Unblock the Notifications