చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?

విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి వీసా దేవుడిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ఈరోజు భక్తులు తండోపతండాలుగా గరుడ ప్రసాదం కోసం చేరుకున్నారు. హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం ముఖ్యంగా వీసాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ చిలుకూరు బాలాజీని దర్శించుకుని 11 రౌండ్లు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని చాలామంది బలంగా విశ్వసిస్తారు.

గరుడ ప్రసాదం కోసం ఆలయానికి పోటెత్తిన భక్తులు
అయితే ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటుంది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులకు గరుడ ప్రసాదం పెడతారని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. నేటి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పడంతో భక్తులు ఆయనకి భారీగా తరలివచ్చారు.

Devotees rush to Chilukur Balaji Temple for Garuda Prasadam what is the speciality

10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అయింది. కాళీ మందిర్ తర్వాత టి ఎస్ పి ఏ జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్డు, మొయినాబాద్ నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తడంతో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

గరుడ ప్రసాదం తింటే సంతాన యోగం
దీంతో భక్తులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గరుడ ప్రసాదం చాలా మహత్యం కలదని, గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని వారికి తప్పక సంతానం కలుగుతుందని అనేక ఉదంతాలు ఉన్నాయని ప్రధాన పూజారి చెప్పిన మాటలను చాలామంది గట్టిగా విశ్వసిస్తున్నారు. సంతానం లేని ఎంతో మంది గరుడ ప్రసాదం కోసం ఈరోజు పోటెత్తారు. ఇప్పటివరకు 30 వేల మందికి పైగా గరుడ ప్రసాదాన్ని అందించారు ఆలయ సిబ్బంది. ఇంకా మిగిలిన భక్తులకు కూడా గరుడ ప్రసాదాన్ని అందిస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+