Hyderabad: హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ డైరెక్ట్ విమానాలు ప్రారంభం..

హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణాలు భారీగా పెరుగుతున్నాయి. దేశీయంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రయాణాలు భారీగా పెరిగాయి. దీంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి పలు దేశాలకు నేరుగా విమానాలు నడుపుతున్నారు. తాజాగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి అక్టోబర్ 27 ఆదివారం బ్యాంకాక్, థాయ్‌లాండ్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ విమానాలు వారానికి నాలుగు సార్లు నడుస్తాయి.

థాయ్ ఎయిర్‌ ఏషియా ఈ విమానాలు నడుపుతోంది. ఈ విమానం(FD119) హైదరాబాద్ నుంచి రాత్రి 11:25 గంటలకు బయలుదేరి మరుసటి ఉదయం 4:30 గంటలకు బ్యాంకాక్ డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటుంది. రిటర్న్ ఫ్లైట్ (FD118) బ్యాంకాక్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:50 గంటలకు బయలుదేరి రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటుంది. ఈ నాన్‌స్టాప్ విమాన సర్వీస్ ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది.

Direct flights from Hyderabad to Bangkok have started

థాయ్‌ ఎయిర్‌ఏషియా భాగస్వామ్యంతో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించడంపై జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రదీప్‌ పనికర్‌ ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కనెక్టివిటీని పెంపొందించడానికి మా ప్రయత్నాలలో ఈ అభివృద్ధి ఒక ముఖ్యమైన మైలురాయిని పేర్కొన్నారు. ఇది హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య ఆర్థిక,సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుందిని చెప్పారు. ప్రఖ్యాత బడ్జెట్ క్యారియర్ అయిన థాయ్ ఎయిర్ ఏషియా నుంచి వచ్చే సర్వీస్ ప్రయాణికులకు మరింత సరసమైన ధరలు ఉండే అవకాం ఉందని పేర్కొన్నారు.

భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు తన నెట్‌వర్క్‌ను విస్తరించే అవకాశం కోసం ఎయిర్‌ఏషియా చాలా కాలంగా ఎదురుచూస్తోందని థాయ్‌ ఎయిర్‌ఏషియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాంటిసుక్‌ క్లోంగ్‌చయ్య అన్నారు. రెండు దేశాల మధ్య ప్రయాణాన్ని అనుసంధానించడం వల్ల పర్యాటకం, వ్యాపారాన్ని పెరుగుతుందని అన్నారు. ఇది రెండు దేాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. ఈ మార్గాలు భారతీయ ప్రజల అవసరాలను అలాగే థాయ్‌లాండ్‌లోని అంతర్జాతీయ ప్రయాణికులు, ఇండియాకి వెళ్లాలని చూస్తున్న థాయ్ ప్రజల అవసరాలను తీరుస్తాయన్నారు.

థాయ్ ఎయిర్‌ఏషియా ఇప్పుడు దేశంలోని 12 నగరాల నుంచి విమానాలు నడుపుతోంది. కోల్‌కతా, చెన్నై, జైపూర్, కొచ్చి, బెంగళూరు, గయా, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, విశాఖపట్నం, తిరుచిరాపల్లి, ఇప్పుడు హైదరాబాద్‌కు విమానాలను నడుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+