హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? ఇది తెలిస్తే అస్సలు తినరు!!
చాలామంది ఇంట్లో వండిన ఆహార పదార్థాలు కాకుండా బయట చేసిన ఫాస్ట్ ఫుడ్స్ ను తినడానికి ఇష్టపడుతుంటారు. బయట చేసిన ఫాస్ట్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ మంచిదికాదని ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా పదేపదే వాటిని తింటూ ఉంటారు. అయితే అటువంటి వారి కోసమే ఈ వార్త.
అసలు బయట చేస్తున్న ఫాస్ట్ ఫుడ్స్ దేనితో తయారు చేస్తారో తెలిస్తే వారు జన్మలో ఫాస్ట్ ఫుడ్స్ జోలికే వెళ్లరు. స్ట్రీట్ ఫుడ్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు తమ బిజీ షెడ్యూల్ లో వంట చేసుకోవటం ఇబ్బంది గా భావించి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో ఆహారాన్ని తింటూ ఉంటారు. అయితే ఇది డేంజర్ అని చెబుతున్నారు.

ఇటీవల పోలీసులు హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఇటీవల ఆర్కే పురానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతను చెప్పిన విషయాలను విని షాక్ తిన్నారు.రమేష్ పంది కొవ్వు తో నూనెను తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
ఈ పంది కొవ్వు తో తయారు చేసిన నూనె ను అతని ఎవరికి విక్రయిస్తున్నాడు అన్నది వివరాలు తెలుసుకున్న పోలీసులు నగరవాసులను హెచ్చరించారు. హైదరాబాద్లోని స్ట్రీట్ ఫుడ్స్ దుకాణదారులకు తాను కొన్నేళ్లుగా ఈ పంది కొవ్వు తో తయారు చేసిన నూనెను తక్కువ ధరకు విక్రయిస్తున్నాననిరమేష్ చెప్పాడని పోలీసులు తెలిపారు.
దీంతో చాలా వరకు హైదరాబాద్ లోని స్ట్రీట్ ఫుడ్స్ తయారీలో ఉపయోగిస్తున్న నూనె పంది కొవ్వు తో తయారు చేసిన నూనె అని పోలీసులు గుర్తించారు. బయట ఫాస్ట్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ తింటున్న వారికి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. పంది కొవ్వు నూనె తో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటే కొద్దిరోజులకే మంచం పట్టడం ఖాయమని చెబుతున్నారు.

కాబట్టి హైదరాబాదీలు స్ట్రీట్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కల్తీ ప్రతి చోట జరుగుతున్న నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్స్ ను కంప్లీట్ గా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. శుభ్రంగా ఇంట్లోనే కావలసినవి వండుకుని తింటే అంతకుమించిన మంచి పని లేదని చెప్పొచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.












Click it and Unblock the Notifications