Nagarjuana: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్..!
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం నాగార్జున స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో మంగళవారం నాగార్జున, నాగ చైతన్య, అమల నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు నాగార్జున వాంగ్మూలం రికార్డు చేసింది. అలాగే సాక్షల వాంగ్మూలం కూడా రికార్డు చేసింది. తమ కుటుంబం పట్ల దేశంలో ఒక గౌరవం ఉందని నాగార్జున అన్నారు. అలాగే తమకు కుటుంబానికి ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.
మంత్రి కొండా సురేఖ తన కుమారుడు, కోడలు విడిపోవడానికి కేటీఆరే కారణమని వ్యాఖ్యలు చేశారు. ఇవి చాలా అసభ్యకరంగా ఉన్నాయి. అందుకే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. నాంపల్లి కోర్టు నాగార్జున పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా కొండా సురేఖ ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ తిరుపతి వర్మ తెలిపారు. నాగార్జున వేసిన పిటిషన్ లో సాక్షులుగా యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్ ఉన్నారు.

మంత్రి కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కీలక ఆరోపణలు చేశారు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని అన్నారు. అంతే కాదు కేటీఆర్ హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఆరోపించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు. తను కావాలని సమంత గురించి మాట్లాడలేదని.. కేటీఆర్ గురించి మాట్లాడే విషయంలో ఆమె గురించి చెప్పాల్సి వచ్చిందని.. అందుకు చింతిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అయినప్పటికీ నాగార్జున పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. ఈ ఇష్యూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వల్ల మొదలైంది. రఘునందన్ రావు, కొండా సురేఖను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications