హైదరాబాద్‌లో బయటపడ్డ కొత్త దందా..వేలిముద్ర సర్జరీలు చేస్తున్న ముఠా..మ్యాటర్ తెలిస్తే షాకే..!!
హైదరాబాద్: మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. ఇక సామాన్య ప్రజలను మోసం చేయడం పక్కనపెడితే, ఏకంగా ప్రభుత్వాలను, ఎయిర్ పోర్ట్ అధికారులను కూడా మోసం చేస్తూ విదేశాలకు చెక్కేస్తున్న గ్యాంగ్ కు సంబంధించిన కొత్త రకం మోసం హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది.

గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు రిజెక్ట్ అయిన వారికి వేలిముద్రల సర్జరీలు
గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు తప్పనిసరి కావడంతో, గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేసి రిజెక్ట్ అయిన యువకులు చాలా మంది, వేలిముద్రలను మార్చుకోవడం కోసం, వేలి ముద్రల క్లోనింగ్ సర్జరీలను చేయించుకుంటున్నారు. ఈ సర్జరీలతో మళ్లీ గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. వేలిముద్రలు మార్పు చేసుకొని, తప్పుడు వివరాలతో సర్జరీ తర్వాత గల్ఫ్ దేశాలకు దొడ్డిదారిన వెళ్తున్న యువకులకు సర్జరీలు చేస్తున్న డాక్టర్ తో పాటు మరి కొంత మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వైద్యులతో కలిసి ఒ గ్యాంగ్ మోసం
హైదరాబాద్‌లో ఈ కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు . గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రల వల్ల అవకాశం లేని యువకులకు కొత్త తరహాలో మోసం చేసేందుకు ఈ ముఠా సర్జరీలు చేసే వైద్యులతో ఒప్పందం చేసుకుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఒకసారి రిజక్ట్ అయిన యువకులు వేలిముద్రల క్లోనింగ్ సర్జరీలతోమళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంవత్సరం పాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా కొత్త రకం సర్జరీ చేస్తున్నట్లు సమాచారం.

వేలిముద్రల సర్జరీలతో దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు
సర్జరీ తర్వాత దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్‌తో పాటు కొంత మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కొత్త తరహా వేలిముద్రల సర్జరీ ద్వారా ఏడాదిపాటు వేలిముద్రలు కనిపించకుండా ఉంటాయని తెలుస్తుంది. ఏకంగా ప్రభుత్వాలనే మోసం చేస్తూ వేలిముద్రల సర్జరీతో ఇతర దేశాలకు వెళుతున్న క్రమంలో నగరంలోని ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇంతకు ముందు వేలిముద్రల క్లోనింగ్ తో బ్యాంకు లావాదేవీలలో డబ్బులు కొల్లగొట్టిన నేరగాళ్ళు కూడా ఉన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications