బంజారాహిల్స్ హోటల్లో అగ్నిప్రమాదం: పరుగులు తీసిన గెస్ట్‌లు, సిబ్బంది
హైదరాబాద్: భాగ్యనగరంలోని బంజారాహిల్స్‌లో గల ఓ హోటల్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కై బ్లూ హోటల్‌లోని మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం విషయం తెలియగానే మూడు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి.
మంటలు అంటుకోవడంతో హోటల్లోని సిబ్బంది, గెస్టులు పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో హోట్లలో ఉన్నవారందరినీ ఫైర్ సిబ్బంది ఖాళీ చేయించింది. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. హోటల్లో నిర్మించిన మూడో ఫ్లోర్ పెంట్ హౌస్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.













Click it and Unblock the Notifications