Hyderabad: ఆ రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి.. లేకుంటే కేసులే..!

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికాగా దీపావళి చేసుకుంటాం. ఈ దీపావళి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది టపాసులు. ఆ రోజు చాలా మంది బాణసంచా పేల్చుతారు. అయితే దీపావళి వేడుకల సందర్భంగా భారీ శబ్ధాలు పుట్టించే టపాకాయలపై హైదరాబాద్ పోలీసులు నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై అధిక డెసిబుల్ క్రాకర్లను పేల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పౌరులు క్రాకర్స్‌ను ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చారు.

అనుమతించదగిన డెసిబెల్ స్థాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనలకు కట్టుబడి ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పటాకులు విక్రయించే స్టాల్స్ యజమానులు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయకూడదని నార్త్ జోన్ డీసీపీ, ఎస్ రష్మీ పెరుమాల్ తెలిపారు. అక్టోబరు 26 నాటికి తెలంగాణ అగ్నిమాపక శాఖకు పటాకులు విక్రయించేందుకు లైసెన్సుల కోసం సుమారు 7,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చారు.

Fireworks should be set off from 8 pm to 10 pm on Diwali in Hyderabad police said

2023లో లైసెన్సుల కోసం 6,610 దరఖాస్తులు వచ్చాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా ను పూర్తిగా నిషేధించారు. అక్కడ వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని మార్కెట్‌లు, నగల దుకాణాలు, పూల దుకాణాలు, స్వీట్‌ దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. చాలామంది పండుగకు ఒక వారం ముందు నుంచే ప్రారంభిస్తారు. ధన్‌తేరస్ దీపావళి వేడుకలు ప్రారంభం అవుతాయి. ఆ రోజు వెండి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

అయితే దీపావళి ఎప్పుడు జరుపుకోవాలనేదానిపై సందిగ్దత నెలకొంది. కొంత మంది అక్టోబర్ 31 దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు. మరికొంత మంది నవంబర్ 1న దీపావళి నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. వేద క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు అమావాస్య ప్రారంభం అవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సాయంత్రం 5 గంటల 14 నిమిషాలకు వెళ్లిపోతుంది. ఆ వెంటనే పాడ్యమి మొదలవుతుంది. దీంతో అక్టోబర్ 31న పండుగ జరుపుకోవాలని పలువురు అయ్యగార్లు పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+