రాజీనామాస్త్రం: టీఆర్ఎస్ పార్టీకి గట్టు రామచంద్రరావు రాజీనామా.. ఎమ్మెల్సీ సీటు ఆశించి..
అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీల అసమ్మతి స్వరం వినిపిస్తోంది. చాలా మంది ఆశావాహులు బెర్త్ ఆశించారు. రకరకాల ఈక్వెషన్స్.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికీ అవకాశం ఇచ్చారు. మరికొందరు ఆశించి భంగపడ్డారు. వారిలో గట్టు రామచంద్రరావు ఒకరు.. ఎమ్మెల్సీ బెర్త్ ఆశించి.. కలత చెందారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు.

అభిమానం పొందలేదు..
అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యానని కేసీఆర్‌ను ఉద్దేశించి లేఖలో గట్టు రామచంద్రరావు తెలిపారు. ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఎదురుదెబ్బ..
గట్టు రాజీనామాతో ఖమ్మం జిల్లాలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ఆశించారు. గట్టు రామచంద్రరావుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. కానీ బెర్త్ మాత్రం దక్కలేదు.

ఏడుగురు
ఇంతకుముందు ఆరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వెంకట్రామరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి రిటర్నింగ్ అధికారి మంగళవారం విజయానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ స్థానాలకు నెల 26న పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. శాసనసభలో టీఆర్‌ఎస్ మినహా ఏ పార్టీకీ ఈ కోటాలో ఎమ్మెల్సీని గెలిపించుకునే సంఖ్యా బలం లేకపోవడంతో ప్రతిపక్షాలేవీ అభ్యర్థులను నిలబెట్టలేదు. స్వతంత్ర అభ్యర్థులుగా ఓ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినా.. ఆ పత్రాలు నిబంధనల ప్రకారం లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం సాయంత్రం 3 గంటలకు గడువు ముగియడం, టీఆర్‌ఎస్ తరఫున దాఖలైన ఆరుగురి నామినేషన్లే ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక వీరితోపాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మధుసూదనాచారికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగానే.. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు కవిత కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ గట్టుకు అవకాశం రాలేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications