బల్దియా కమిషనర్ దాన కిశోర్ బదిలీ, కొత్త కమిషనర్‌గా లోకేశ్
హైదరాబాద్ : బల్దియా కమిషనర్ దాన కిషోర్‌పై బదిలీ వేటు పడింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆయన ఏడాదిపాటే విధులు నిర్వర్తించారు. ఇదివరకు ఉన్న జలమండలి ఎండీ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం దానకిశోర్‌కు అప్పగించింది. దానకిశోర్ బదిలీ అధికార వర్గాల్లో చర్చానీయాంశమైంది. ఇదివరకు కమిషనర్ జనార్థన్ రెడ్డి, సోమేశ్ కుమార్‌పై కూడా బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. దీంతో దానకిశోర్‌ను బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన బదిలీకి సంబంధించి అధికార సమాచారం తెలియరాలేదు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బల్దియా కమిషనర్ దానకిశోర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం దానకిశోర్ జీహెచ్ఎంసీతోపాటు జలమండలి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బల్దియా నుంచి బదిలీ చేయడంతో ఇక జలమండలి ఎండీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా రంగారెడ్డి కలెక్టర్ లోకేశ్ కుమార్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీశ్‌కు రంగారెడ్డి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా దానకిశోర్ కేవలం ఏడాదిపాటు కొనసాగారు. ఇదివరకు కమిషనర్ జనార్థన్ రెడ్డి, సోమేశ్ కుమార్‌పై కూడా బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. దీంతో దానకిశోర్‌ను బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన బదిలీకి సంబంధించి అధికార సమాచారం తెలియరాలేదు.












Click it and Unblock the Notifications