హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బడా షాపింగ్స్ మాల్స్‌ను సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం సర్కిల్‌లో పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలుషాపులను సీజ్ చేశారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్స్‌ ఉపయోగంపై నిషేధం విధించిన నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా పలు దుకాణాల్లో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు దాడులు కొనాసాస్తున్నారు. మరోవైపు ట్రేడ్ లైసెన్స్‌తో పాటు ఇతర పార్కింగ్ సౌకర్యాలు లేని షాపింగ్ మాల్స్‌పై తనిఖీలు చేసి పలు షాపులను సీజ్ చేశారు.

ట్రేడ్ లైసెన్స్ లేకుండా, పార్కింగ్ సౌకర్యం లేకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలు, వ్యాపార సంస్థల్లో దాడులు చేసి వాటిని సీజ్ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా మెహిదీపట్నంలో నిర్వహిస్తున్న చెన్నై సిల్క్స్, విజయ నగర్ కాలనీ సమీపంలోని ఎన్ఎండీసీ వద్ద ఉన్న సూపర్ మార్కెట్‌ను సీజ్ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్న మెహిదీపట్నంలోని ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్‌ను కూడా సీజ్ చేశారు. మహావీర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న మోర్ సూపర్ మార్కెట్‌కు పార్కింగ్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు రూ.25 వేల జరిమానా విధించారు. మరోవైపు మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ ఉపయోగిస్తున్నందుకు గాను సీజ్ చేశారు.

GHMC officials have Siege the several shopping malls

కాగ గతవారమే పలు సర్కిళ్లలోని హోటళ్లలో తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారలు ప్రముఖ హోటర్ ప్యారడైజ్ హోటళ్‌తో పాటు, హోటల్ అభినందన్‌ పై లక్ష రూపాయల జరిమాన విధించారు.

English summary
GHMC officials have Siege the several shopping malls who violations of regulations in Mehdipatnam Circle in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X