తెలంగాణలో గోల్డ్‌మన్ సాచ్స్ భారీ పెట్టుబడి: అమెరికాలో కేటీఆర్ కీలక భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ తెలంగాణలో తన భారీ విస్తరణకు ప్రణాళికలను ప్రకటించింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో అమెరికాలోని న్యూయార్క్‌లో కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ ఛైర్మన్, సీఈవో డేవిడ్ ఎం సోలమన్‌తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం కంపెనీ ఈ మేరకు ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో గోల్డ్‌మెన్ సాచ్స్ సంస్థ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఆ సంస్థ ప్రకటించిన విస్తరణ ప్రణాళికలలో భాగంగా.. ప్రస్తుతం 1000 మంది ఉన్న చోట రెండు రెట్లు పెంచి 2000 మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకోసం సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల కార్యాలయ విస్తరణను చేపట్టనున్నట్లు తెలిపింది.

బ్యాంకింగ్ సేవలు, బిజినెస్ అనలిటిక్స్, ఇంజినీరింగ్ వంటి వివిధ రంగాలలో గోల్డ్‌మెన్ సాచ్ సంస్థ కార్యకలాపాల బలోపేతం కోసమే.. ఈ కొత్త కేంద్రం పనిచేయనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా గతవారం అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్ వెళ్లారు.
అంతకుముందు మే నెలలో యూకే, అమెరికా దేశాల్లో పర్యటించిన కేటీఆర్ ప్రముఖ సంస్థల ప్రతినిధులను కలిసిన విషయం తెలిసిందే. 80కిపైగా వ్యాపార సమావేశాలకు హాజరైన కేటీఆర్.. లండన్, న్యూయార్క్, హ్యూస్టన్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్‌లలో పర్యటించారు. రెండు వారాలపాటు కేటీఆర్ పర్యటన కొనసాగింది. పలు సంస్థల పెట్టుబడులతో సుమారు 42 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నట్లు మంత్రి కేటీఆర్ కార్యాలయం ప్రకటించింది.
No better way to start my short working trip in the US than at the picturesque beautiful office of @GoldmanSachs at downtown New York 😊
— KTR (@KTRBRS) August 23, 2023
Goldman Sachs, leading global investment banking, and financial services firm will be expanding in a big way by adding 2,000 new jobs in… pic.twitter.com/Rw5JKXD7ed
తెలంగాణ రాషంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, మెడ్‌ట్రానిక్, స్టేట్ స్ట్రీట్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూపు, వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్, డాజోన్, అలియంట్, స్టెమ్‌క్రూజ్, మాండీ, జాప్‌కామ్, టెక్నిప్ ఎఫ్ఎంసీ వంటి గ్రూపులు ఉన్నాయి. దాదాపు 30 కంపెనీలకు చెందిన ఎన్నారై సీఈఓలతో మంత్రి కేటీఆర్ సమావేశాలు నిర్వహించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. దీనిలో నల్గొండలో సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీ, కరీంనగర్లో 3ఎం-ఎక్లాట్, వరంగల్‌లో రైట్ సాఫ్ట్వేర్ సంస్థలు కార్యకలాపాల విస్తరణకు అంగీకరించాయని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications