హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ వార్ ... నామినేషన్ల ప్రక్రియ షురూ .. నగరంలో వాటిపై ఈసీ కొరడా

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలి అన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ తమ హయాంలో సాధించిన అభివృద్ధి చూపిస్తూ, వరదల వల్ల నష్టపోయిన వారికి వరద సహాయం అందించామని ప్రజల మద్దతు సంపాదించే ప్రయత్నం చేస్తుంటే, గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల వరదల కారణంగా ప్రజలు పడిన ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

గ్రేటర్ వార్: బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న కాంగ్రెస్..అసలేం జరుగుతోంది ?గ్రేటర్ వార్: బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న కాంగ్రెస్..అసలేం జరుగుతోంది ?

మొదలైన నామినేషన్ల ప్రక్రియ .. నవంబర్ 20 వ తేదీ దాకా .. మూడు రోజుల పాటు

మొదలైన నామినేషన్ల ప్రక్రియ .. నవంబర్ 20 వ తేదీ దాకా .. మూడు రోజుల పాటు

ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. నేటి నుండి గ్రేటర్ హైదరాబాద్ లో నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. నేటి నుండి నవంబర్ 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు కేవలం మూడు రోజులే గడువు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి . ఇక ఎన్నికల సంఘం అధికారులు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సజావుగా నామినేషన్లు దాఖలు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.

గ్రేటర్ లో అమల్లో ఉన్న ఎన్నికల నియమావళి .. రంగంలోకి అధికారులు

గ్రేటర్ లో అమల్లో ఉన్న ఎన్నికల నియమావళి .. రంగంలోకి అధికారులు

గ్రేటర్ పరిధిలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు, కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి తో పాటుగా మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అనుమతి ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి గ్రేటర్ హైదరాబాద్ లో అమల్లోకి రావడంతో నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేసే నోడల్ అధికారి గా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు.

 20 ప్రత్యేక బృందాలతో 4 వేల బ్యానర్లు, పోస్టర్లు తొలగింపు

20 ప్రత్యేక బృందాలతో 4 వేల బ్యానర్లు, పోస్టర్లు తొలగింపు

గ్రేటర్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొరడా ఝళిపిస్తూ ఉన్న అధికారులు చర్యల్లో భాగంగా పోస్టర్లు , బ్యానర్లను తొలగిస్తున్నారు. ఫ్లెక్సీలు , బ్యానర్ల తొలగింపుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విభాగం. నిన్న ఒక రోజు నగరంలో దాదాపు నాలుగు వేలకు పైగా ఫ్లెక్సీలను బ్యానర్లను తొలగించారు. ఇక నేటి నుండి నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు హడావిడి పడుతున్నారు.

English summary
The nominations process has started in Greater Hyderabad from today. Nominations will be accepted from today until November 20. With just three days for the submission of the nominations , the major political parties are immersed in the selection of candidates. The Election Commission officials have arranged for the nominations to be filed without any disturbances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X