• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హయత్‌నగర్ బీఫార్మసీ విద్యార్థిని సేఫ్.. కిడ్నాప్ జరిగిందా.. డ్రామానా?

|

హైదరాబాద్ : హయత్ నగర్ బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసులో చిక్కుముడి వీడింది. ఆమె క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే పోయిన మంగళవారం నాడు కిడ్నాప్ జరిగితే సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత మంగళవారం నాడు సోని తిరిగిరావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్ నిజంగా జరిగిందా.. లేదంటే ఏదైనా డ్రామా నడిచిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోనికి తెలియకుండానే నిందితుడితో ఎనిమిది రోజులుగా సావాసం చేసిందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.

 సోని సేఫ్.. కిడ్నాపర్ జాడేది?

సోని సేఫ్.. కిడ్నాపర్ జాడేది?

హయత్‌నగర్ బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ మిస్టరీ వీడింది. సోని క్షేమంగా ఉన్నట్లు ఆమె మామయ్య చెబుతున్నారు. ఈనెల 23వ తేదీ మంగళవారం నాడు కిడ్నాప్‌కు గురైన సోని సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత తిరిగి వచ్చారు. అయితే కిడ్నాపర్ ఇన్ని రోజులు ఎక్కడెక్కడ తిప్పాడనేది ట్విస్టుగా మారింది. సోని నోరు విప్పితే తప్ప నిజాలేంటో బయటకు రావు. ఆ క్రమంలో ఆమె ఆచూకీ అద్దంకిలో దొరికిందని.. కాదు కాదు హైదరాబాద్‌లో కిడ్నాపర్ స్వయంగా విడిచిపెట్టాడనే ప్రచారం జరుగుతోంది.

ఆమె కిడ్నాప్ జరగడంలో ఎన్ని ట్విస్టులున్నాయో.. ఆమె విడుదలయ్యాక కూడా ఈ కేసులో అన్నే ట్విస్టులు కనిపిస్తున్నాయి. మొదటినుంచి కూడా రకారకాలుగా అనుమానిస్తున్న పోలీసులు చివరకు కేసు చేధించలేకపోయారు. దాంతో నిందితుడి సమాచారం ఇస్తే లక్ష రూపాయలు పారితోషికం ఇస్తామంటూ ప్రకటించారు. మొత్తానికి క్షేమంగా హైదరాబాద్‌కు సోని తిరిగొచ్చిందనే వార్తల నేపథ్యంలో ఆమె హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదెక్కడి సరదారా నాయనా.. పోలీసుకే ముద్దు పెట్టాడు..! (వీడియో)

మంగళవారం కిడ్నాప్.. మంగళవారం నాడే విడుదల..!

మంగళవారం కిడ్నాప్.. మంగళవారం నాడే విడుదల..!

ఈ నెల 23వ తేదీ మంగళవారం నాడు కల్లిబొల్లి మాటలు చెప్పి సోని తండ్రి యాదయ్యను ముగ్గులోకి దించాడు. టీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న యాదయ్య దగ్గరకు శ్రీధర్ రెడ్డి పేరుతో వచ్చాడు. టీ తాగుతూ యాదయ్య ఫ్యామిలీ నేపథ్యం గురించి ఆరా తీశాడు. ఆ క్రమంలో తన పెద్దకూతురు సోనికి ఉద్యగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అంతేకాదు అప్పటికప్పుడు వారి కుటుంబంతో చనువు పెంచుకుని సోనితో పాటు యాదయ్యను తన కారులో ఎక్కించుకుని బయల్దేరాడు.

ఆ క్రమంలో సోనికి సంబంధించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ తీసుకురావాల్సిందిగా యాదయ్యను కోరాడు. ఆ క్రమంలో ఆయన కారు దిగి అలా వెళ్లగానే సోనితో సహా ఉడాయించాడు. అయితే ఈ కేసులో సీసీ ఫుటేజ్‌ను కీలకంగా మలుచుకున్న పోలీసులు వాడు వాడుతున్న కారును గుర్తించారు. ఆ కారు నెంబరుతో యజమాని వివరాలు కనుక్కుని ఆరా తీయగా చోరీకి గురైనట్లు తెలిసింది. దాంతో పోలీసులకు ఈ కేసు క్లిష్టతరంగా మారింది.

కిడ్నాపా.. డ్రామానా?.. సోని నోరు విప్పితేనే నిజాలు..!

కిడ్నాపా.. డ్రామానా?.. సోని నోరు విప్పితేనే నిజాలు..!

కిడ్నాపర్ రవిశేఖర్‌పై చోరీలతో పాటు దాదాపు 26 కేసులున్నాయి. ఆ క్రమంలో సోని కిడ్నాప్ ఆందోళనకు గురిచేసింది. ఆమెను ఏమైనా చేస్తాడా, అసలు సోనిని కిడ్నాప్ చేయాల్సిన అవసరమేముంది.. ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ క్రమంలో రాచకొండ పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. వాడి మూలాలు ఈజీగానే కనుక్కున్నప్పటికీ.. ఆచూకీ మాత్రం దొరకలేదు. దాంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నిందితుడు భయపడి సోనిని వదిలేశాడా.. లేదంటే వేరే కారణాలున్నాయా అనేది పరిశీలిస్తున్నారు.

కిడ్నాప్ చేసిన నాటి నుంచి ఆమెను రెండు రాష్ట్రాల్లో కారులోనే తిప్పుతూ తిరిగినట్లు పలు ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే సోని కిడ్నాప్ నిజంగా జరిగిందా. అదంతా డ్రామానా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఎనిమిదిరోజుల పాటు గుర్తు తెలియని వ్యక్తితో సోని ఎలా ఉంటుందనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తన తండ్రిని మధ్యలోనే దింపేసి.. తనను ఒక్కదాన్నే కారులో తీసుకెళుతున్నప్పుడు ఎందుకు అరవలేదు.. ఎనిమిది రోజుల పాటు తిండి కోసం ఎక్కడో ఏదో హోటల్ దగ్గర ఆపినప్పుడు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. సోని నోరు విప్పితే గానీ ఈ కిడ్నాప్ కథ అంతుచిక్కదేమో.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Hayatnagar Bpharmacy Girl Student safe who had kidnapped one week ago. Kidnapper Ravishekar most wanted criminal who taken away with him. Police were taken seriously and try to traced out, but he escaping. At last The Girl Came to Hyderabad, then many doubts raised in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more