హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెకండ్ డోసు టార్గెట్: బూస్టర్ మొదలవుతోన్న నేపథ్యంలో అలర్ట్.. అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు.. ఒమిక్రాన్ కేసుల దడ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వాలు ఫోకస్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా టీకాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే వాక్సినేషన్‌పై దృష్టి సారించడం వల్ల ఫస్ట్ డోసు లక్ష్యం వంద శాతానికి చేరువ అయిందన్నారు. ఇదే స్ఫూర్తితో రెండో డోసును వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.

15-18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్, 60 ఏళ్లు పై బడిన వారికి బూస్టర్ డోస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంత్రి హరీశ్ రావు ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి.లో వైద్యాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి గురించి ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు, వారి ఆరోగ్య పరిస్తితి, అందిస్తున్న చికిత్స గురించి తెలిపారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభావం తక్కువ ఉన్నట్లు పలు అధ్యయనాల ఆధారంగా చెప్పారు. ఒమిక్రాన్ సోకి టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న, వారి ఆరోగ్యం బాగుందని, కోలుకుంటున్నారని సమీక్షలో అధికారులు వివరించారు.

health minister harish rao review officilas on vaccine

జాతీయ స్థాయిలో ఫస్ట్ డోసు సగటు 90 శాతం ఉంటే, తెలంగాణలో 99.46 శాతానికి చేరువ అయిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. రెండో డోసు విషయంలో జాతీయ సగటు 61 కంటే 3 శాతం ఎక్కువతో, 64 శాతం ఉన్నట్లు చెప్పారు. కరోనా నుండి ప్రజలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాల్సిన నేపథ్యంలో రెండో డోసు విషయంలో మరింత వేగాన్ని పెంచాలని ఆదేశించారు. 15-18 ఏళ్ల వయస్సు వారు 22.78 లక్షలు, 60 ఏళ్ల పై బడిన వారు 41.60 లక్షలు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు 6.34 లక్షలు ఉన్నారని, వీరందరికీ 70 లక్షల వ్యాక్సిన్ అవసరం ఉంటుందన్నారు. జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఒకవేళ కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించుకోవాలని సూచించారు. ఇందుకోసం అదనపు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, అలా అని ప్రజలు నిర్లక్ష్యం‌గా ఉండకూడదని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోవడంతోపాటు, మాస్క్ ధరించాలనీ, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

English summary
telangana health minister harish rao review officilas on vaccination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X