హైదరాబాద్‌లో కుండపోత వర్షం, బయటికి రావొద్దు: ఈ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు, హెచ్చరికలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన వానలు మంగళవారం వరకు కొనసాగాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెం.మీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలంలో 15 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. నిజామాబాద్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా గాంధారిలో 10 సెం.మీ వర్షం కురిసింది.

 Heavy rain in Hyderabad city: very heavy rains in telangana districts today

కాగా, రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేని భారీ వర్షం

హైదరాబాద్ నగరంలో దాదాపు అన్ని ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, నాంపల్లి, మలక్ పేట్, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్ రోడ్, హస్తినాపురం, సికింద్రాబాద్ , బేగంపేట్, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం వర్షం జోరుగా కురుస్తోంది.

Heavy rain in Hyderabad city: very heavy rains in telangana districts today

సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కొనసాగుతోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. మరో ఐదు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+