Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం, అవసరమైతే తప్ప బయటికి రావొద్దు

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కుత్బుల్లాపూర్, గాజులరామారం, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం, కోఠి, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

సాయం కోసం ఈ నెంబర్లను సంప్రదించండి

భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. రెండ్రోజుల క్రితం కురిసన భారీ వర్షాలతో 11 ఏళ్ల చిన్నారి నాలాలో పడి మృతి చెందిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం కారణంగా ఏమైనా ఇబ్బందులు వస్తే 040-21111111, 040- 29555500 కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి కోరారు.

Heavy rains in hyderabad and telangana district

మరోవైపు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వడగళ్లవానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్జ్‌ జారీ చేసింది. కాగా, జనగామ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్, పాలకుర్తి, దేవరప్పుల, సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ, తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.

ఆదివారం కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదైంది. సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

కాగా, ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని..అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచించింది. కాగా, తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరితోపాటు ఇతర పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది.. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవానలి కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+