ఊహించని వివాదంలో నటి చార్మి.. పూరీ ఆఫీసులో కెమెరా ముందు..
గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, చివరికి సిట్ విచారణలో బాధితురాలిగా బయటపడ్డ నటి, నిర్మాత చార్మి కౌర్ మరోసారి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ-అనన్య పాండే నటిస్తోన్న 'ఫైటర్'సినిమా నిర్మాణంలో ఆమె బిజీగా ఉన్నారు. సోమవారం కాస్త తీరిక దొరకడంతో ఆఫీసులో కెమెరా ముందు ఓ పని చేశారు.. అది కాస్తా రచ్చకు దారితీసింది.. తప్పు సరిచేసుకునేలోపే పరిస్థితి చేయిదాటిపోయింది.. అసలేం జరిగిందంటే..

వీడియో హల్ చల్..
ప్రపంచ వ్యాప్తంగా 3వేల మందిని బలితీసుకుని.. అందరినీ గజగజలాడిస్తోన్న కోవిడ్-19 (కరోనావైరస్) రోజురోజుకూ విస్తరిస్తున్నది. సోమవారం నాటికి దేశరాజధాని ఢిల్లీకి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూడా వైరస్ విస్తరించింది. హైదరాబాద్, ఢిల్లీలో కొత్తగా గుర్తించిన కరోనా పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి.. ఇతర దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన మరో వ్యక్తికి వైరస్ సోకిందని వెల్లడించిన కేంద్రం.. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీనిపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రివ్యూకూడా నిర్వహించారు. అంతలోనే చార్మి వీడియో బయటికొచ్చింది..

ఆల్ ది బెస్ట్..
తెలంగాణలో కరోనా కేసు నమోదుపై చార్మి తన ట్విటర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆఫీసులో కూర్చున్న ఆమె.. తన దగ్గరికొచ్చిన కెమెరావైపు చూస్తూ.. ‘‘ఆల్ ది బెస్ట్ గాయ్స్.. ఎందుకో తెలుసా? కరోనా వైరస్ తెలంగాణ, ఢిల్లీకి వ్యాపించిందంట. ఇప్పుడే వార్తల్లో చూశాను. వావ్.. అందరికీ ఆల్ ది బెస్ట్..'' అని అన్నారు. నిమిషాల్లో ఆ వీడియో వైరల్ అయింది. వైరస్ పై చార్మి కామెంట్లు వెకిలిగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడ్డారు.

దిమాక్ ఖరాబ్..
అవతల వేల మంది ప్రాణాలు పోతూ, ఆర్థిక రంగాన్ని సైతం అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ గురించి ఇంత దారుణంగా మాట్లాడటమేంటని నెటిజనలు చార్మిని ప్రశ్నించారు. ఇంకొంతమంది దిమాక్ ఖరాబైందా తరహాలో అనుచిత కామెంట్లు కూడా చేశారు. తన వీడియోపై దుమారం రేగడంతో దాన్ని ఆమె డిలిట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

హైదరాబాద్‌కు కరోనా ఎలా వచ్చిందటే..
హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. బెంగళూరులో పనిచేస్తూ, కంపెనీ పనిమీద ఫిబ్రవరి 15న దుబాయ్ వెళ్లాడని, అక్కడ హాంకాంగ్ కు చెందినవారితో పనిచేశాడని.. టూర్ ముగిసిన తర్వాత 22న హైదరాబాద్ లోని ఇంటికి వచ్చాడని, ఆ తర్వాత జ్వరంతో బాధపడుతూ 27న అపోలో ఆస్పత్రిలో చేరాడు. కరోనా అనుమానంతో అతణ్ని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి, శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపగా...కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయిందని మంత్రి ఈటల వివరించారు. ఈ ఒక్క కేసు తప్ప తెలంగాణకు కరోనా భయం లేదని, ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురికావొద్దని మంత్రి చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications