హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒకరోజు ప్రధాని అవుతారు.. నేను ఉన్నా లేకున్నా, అసదుద్దీన్ విశ్వాసం..
హిజాబ్ వివాదం చినికి చినికి గాలివాన అయ్యింది. కాలేజీలో మొదలైన గొడవ దుమారం రేపుతోంది. దీనిపై ముస్లిం సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హిజాబ్ గురించి రచ్చ చేయడంపై మరోసారి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన వీడియో ట్వీట్ చేశారు. ఏదో ఒకరోజు ఒక హిజాబీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని పేర్కొన్నారు. కర్ణాటకలో గల ఉడుపిలో హిజాబ్ అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే.

హిజాబ్ ధరించి..
హిజాబ్ ధరిస్తానని ఓ ఆడపిల్ల తన తల్లిదండ్రులతో అంటుందని, అందుకు తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తారని అసద్ ఆ వీడియోలో వివరించారు. హిజాబ్ ధరించకుండా ఎవరు ఆపుతారో చూద్దామని ధైర్యం చెబుతారని చెప్పారు. ఆడపిల్ల హిజాబ్ ధరించి వైద్యురాలు కూడా అవుతుందని పేర్కొన్నారు. కలెక్టర్, వ్యాపారవేత్త కూడా అవుతుందని తెలిపారు. దేవుడి దయవల్ల ఏదో ఒక రోజు హిజబ్ ధరించిన మహిళే ప్రధాని కూడా అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను బతికి లేకున్నా హిజబ్ ధరించిన మహిళ తప్పకుండా ప్రధాని అవుతారని కామెంట్ చేశారు. దేశంలో చెలరేగుతోన్న హిజాబ్ వ్యవహారంపై పలు దేశాలు కూడా స్పందిస్తోన్నాయి.ఉడుపిలో మొదలైన హిజాబ్ వివాదం.. క్రమంగా అంతటా విస్తరించింది. హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విద్యార్థులు చీలిపోయి ఆందోళనలకు దిగడంతో సమస్య ముదిరింది.

ఉడుపిలో మొదలు..
గత నెలలో ఉడుపిలోని ఓ ప్రభుత్వ కాలేజీకి హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను అడ్డుకోవడంతో వివాదం స్టార్ట్ అయ్యింది. పోటీగా పలువురు కాషాయ కండువాలను మెడలో వేసుకుని పాఠశాలలకు రావడంతో రెండు వర్గాలుగా విద్యార్థులు విడిపోయారు. ఇటు రాష్ట్రంలోని శివమొగ్గలో పరిస్థితి అదుపుతప్పడంతో 144 సెక్షన్ విధించి.. నిషేధాజ్ఞలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను కూడా తరలించారు.

జై శ్రీరాం
ఇటు మండ్యలో జైశ్రీరాం అంటూ కాషాయ శాలువాలను ధరించిన విద్యార్థులు నినదిస్తున్న సమయంలో ఓ ముస్లిం విద్యార్థిని అక్కడకు హిజాబ్ ధరించి వచ్చింది. ఆమెను చూసిన విద్యార్థులు మరింత గట్టిగా నినదించారు. అందుకు ప్రతిగా ఆమె కూడా 'అల్లాహు అక్బర్' అంటూ పెద్దపెట్టున నినదించారు. ఆ సందర్భంలో టీచర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఉడుపిలోని ఎంజీఎం కళాశాల విద్యార్థులు కొందరు కాషాయ తలపాగాల్ని ధరించి కళాశాలకు రావడం విశేషం. హిజాబ్ వివాదం కర్ణాటకలో ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతానికి అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. శాంతంగా ఉండాలని మత పెద్దలు పిలుపును ఇస్తున్నారు.
इंशा’अल्लाह pic.twitter.com/lqtDnReXBm
— Asaduddin Owaisi (@asadowaisi) February 12, 2022
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications