హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ధరాత్రి రాజా సింగ్ ఇల్లు ముట్టడికి యత్నం: తీవ్ర ఉద్రిక్తత: నిరసనల హోరు: ఎస్ఐకి గాయాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సస్పెన్షన్‌కు గురైన భారతీయ జనతా పార్టీ గోషామహల్ శాసన సభ్యడు టీ రాజా సింగ్.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకంపన తీవ్రత తగ్గట్లేదు. మరింత రాజుకుంటూనే వస్తోంది. నగర వ్యాప్తంగా రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి- పాతబస్తీ నిప్పుల కుంపటిలా తయారైంది. హైదరాబాద్ నగర పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

కీలక పరిణామాలు..

కీలక పరిణామాలు..


మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన టీ రాజా సింగ్‌ అరెస్ట్ అయ్యారు. ఆయనను నాంపల్లి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఆయనకు బెయిల్ లభించింది. అరెస్టయిన కొన్ని గంటలకే ఆయనను బీజేపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సభాపక్ష నేత హోదా నుంచీ తొలగించింది. 10 రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఆయన అరెస్టును నిరసిస్తూ ఇవ్వాళ బీజేపీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. నిరసన దీక్షలను చేపట్టనుంది.

పాతబస్తీలో ఉద్రిక్తత..

పాతబస్తీలో ఉద్రిక్తత..

రాజా సింగ్‌కు బెయిల్ లభించిన అనంతరం- పాతబస్తీలో వాతావరణం క్రమంగా వేడెక్కింది. అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బార్కస్ నుంచి చంద్రాయణ గుట్ట వరకూ ఈ నిరసన ప్రదర్శన కొనసాగింది. బైక్స్, ఇతర వాహనాల్లో వారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు చార్మినార్ వద్ద భారీ సభను కూడా నిర్వహించారు.

గోషా మహల్‌ వెళ్లే యత్నం..

గోషా మహల్‌ వెళ్లే యత్నం..


నల్లజెండాలను ప్రదర్శించారు. రాజా సింగ్ దిష్టిబొమ్మలను పలుచోట్ల దగ్ధం చేశారు. షాలిబండ, డబీర్ పుర, ఫత్తర్ ఘట్టి, మొఘల్‌పుర, ఖిల్వత్, కాలా పత్థర్ వంటి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆందోళనకారులు గోషా మహల్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ముస్సలాం జంగ్ బ్రిడ్జి మీదుగా వారు గోషామహల్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. రాజా సింగ్ ఇంటిని ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు.

తోపులాట..

తోపులాట..


ఈ సందర్భంగా పోలీసులు-ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఓ ఎస్‌ఐ సహా నలుగురు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం అందింది. పాతబస్తీలో ఈ తరహా వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భావించిన హైదరాబాద్ నగర పోలీసులు పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. ఆందోళన కారుల ప్రదర్శనలు కట్టుతప్పకుండా చూసుకున్నారు.

రంగంలో డీసీ చౌహాన్..

రంగంలో డీసీ చౌహాన్..


అదనపు పోలీస్ కమిషన్ (లా అండ్ ఆర్డర్) డీసీ చౌహాన్ స్వయంగా పాతబస్తీలో పర్యటించారు. అక్కడి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను నివారంచడంలో పోలీసులు సఫలం అయ్యారు. తెల్లవారు జామున 4 గంటల వరకూ పాతబస్తీలో ఆందోళన తీవ్రత కొనసాగింది. మొఘల్ పుర, ఖిల్వత్, కాలా పత్థర్ వంటి సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు.

English summary
Hundreds of protesters came to the roads of Barkas to march to Chandrayangutta in Hyderabad, raising slogans against suspended BJP MLA Raja Singh over his alleged derogatory comments against Prophet Mohammed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X