భార్య తల నరికి భర్త ఘాతుకం .. తల అనుమానితుడి ఇంటి ముందు పెట్టి ఆపై...
అనుమానం పెనుభూతం అయింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. అన్యోన్యంగా కాపురం చేసుకోవాల్సిన దంపతుల్లో కలతలు రేపింది . భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న అనుమానం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు భర్త ఓ రోజు అర్ధరాత్రి సమయంలో భార్య తల నరికి అత్యంత పాశవికంగా హతమార్చే వరకు వెళ్ళింది. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన వివరాల్లోకి వెళితే

భార్యపై అనుమానం .. తరచూ గొడవ పడుతున్న భర్త
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ లో జుర్రు సాయిలు, అనూష దంపతులు జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కుమారుడు శ్రీకాంత్. అతను హైదరాబాదులో బీటెక్ చదువుతున్నాడు. సాయిలు స్థానికంగా వ్యవసాయం చేస్తూ వేసవికాలంలో హైదరాబాదులో చెరకురసం బండి నడుపుతూ ఉంటారు. అయితే గత కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సాయిలు, తరచూ భార్యతో గొడవ పడుతున్నారు. భార్య స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది అని పలుమార్లు ఆమెతో గొడవకు దిగాడు.

గొడ్డలితో తల నరికి .. ఆపై తలను అనుమానితుడి ఇంటి ముందు పెట్టిన దారుణం
ఈ క్రమంలోనే ఇటీవల ఆమెతో మరోమారు గొడవకు దిగిన సాయిలు తీవ్ర ఆగ్రహంతో గొడ్డలితో భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆ తర్వాత మొండాన్ని ఇంటికి కాస్త దూరంలో పడేసి, భార్య తలను తీసుకువెళ్లి, ఎవరితో అయితే అక్రమ సంబంధం ఉన్నట్లుగా సాయిలు అనుమానిస్తున్నాడో నారాయణ ఖేడ్ లో అతని ఇంటి ముందు పడేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి సాయిలు లొంగిపోయాడు. తన భార్యను హతమార్చినట్లుగా, తలను అనుమానితుడి ఇంటిముందు పెట్టినట్లుగా పోలీసులకు చెప్పడంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.
Recommended Video

అనుమానం ఓ కుటుంబాన్నే నాశన చేసింది
తన తండ్రిని తల్లిని అత్యంత కిరాతకంగా హతమార్చారు అన్న కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఓ భర్త అనుమానం పచ్చని కాపురం లో చిచ్చుపెట్టి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. భార్య వేరేవారితో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది అన్న అనుమానం ఉన్న భర్త చివరకు ఆమెను హతమార్చి తాను జైలుపాలయ్యాడు. కన్నకొడుకును అనాధను చేశాడు.
అటు తల్లి లేక, ఇటు తండ్రి జైలుపాలు కాగా ఆ కొడుకు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది .












Click it and Unblock the Notifications