బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌పై కేసు నమోదు
హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడుతున్న వ్యవహారంలో బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
నవయువ ఇంజినీరింగ్ కంపనీ లిమిటెడ్ ప్రతినిధి చింతా మాధవ్ ఫిర్యాదుతో సంతోష్ కుమార్‌తోపాటు లింగారెడ్డి శ్రీధర్ మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని సర్వే నంబర్ 129/54లోని కరణ్ దుబే అతని భార్యా భారతి దుబేల నుంచి 1350 చదరపు గజాల స్థలాన్ని తమ కంపెనీ కొనుగోలు చేసిందని తెలిపారు.

ఈ స్థలంలో కొన్ని రోజుల క్రితం రెండు గదులు నిర్మించి జోగినపల్లి సంతోష్, లింగారెడ్డి శ్రీధర్.. నకిలీ డోర్ నంబర్లు సృష్టించి జీహెచ్ఎంసీకి పన్ను కూడా కడుతున్నారని చింతా మాధవ్ ఫిర్యాదులో వెల్లడించారు. ఈ వ్యవహారంపై మార్చి 21న చింతా మాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దితో పాటు మరి కొందరిపై సెక్షన్ 400, 471,447,120బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసులో మరో ఇద్దరు ఏఎస్పీలు అరెస్టైన విషయం తెలిసిందే. డీఎస్పీ ప్రణీత్‌రావు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను నాంపల్లి కోర్టులో హాజరు పరుచగా వారిద్దరికి 14రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా ఏప్రిల్ 6 వరకు ఇద్దరు పోలీసుల రిమాండ్‌లో ఉండనున్నారు.












Click it and Unblock the Notifications