హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోళి.. రంగులకేళికి సిటీ రెడీ, బీకేర్‌ఫుల్ అంటోన్న నిపుణులు

|
Google Oneindia TeluguNews

హోళి.. రంగులకేళి... రేపు రంగుల పండగ. పండుగకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. కరోనా వల్ల గత రెండేళ్ల నుంచి పండగ శోభ లేదు. ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంది. ఈసారి హోలీ కలర్‌ఫుల్‌గా నిర్వహించుకొనేందుకు నగర ప్రజలు రెడీ అయిపోతున్నారు. వందలాది మంది మధ్య నిర్వహించే రెయిన్ డ్యాన్స్‌, పలు వేడుకలు నిర్వహించేందుకు సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

 హోళి.. రంగులకేళి

హోళి.. రంగులకేళి


ఏటా పాల్గుణ పౌర్ణమి రోజున వస్తుంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా పెస్టివల్ నిర్వహించుకుంటారు. హోలీ ఒక రోజు ముందు హోలీక దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. రంగులు కొనుక్కోనేందుకు వెళుతుండడంతో మార్కెట్లు అన్నీ సందడిగా మారాయి. పలు అపార్ట్ మెంట్‌లో సమూహంగా వేడుకలు నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 సిటీకి అనుబంధం

సిటీకి అనుబంధం


హోలీ ఫెస్టివల్ కు నగరానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారు. ఇతర సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చే వారని చరిత్రకారులు చెబుతుంటారు. రంగుల పండుగను అధికారికంగా గోల్కొండ కోట వేదికగా జరిపే వారని అంటుంటారు. కుతుబ్ షాహీ పాలకులు అత్యంత ఘనంగా హోలీని నిర్వహించే వారని వెల్లడిస్తున్నారు. అప్పట్లో హోలీ ఆడేటప్పుడు సేంద్రీయ రంగులు వాడేవారు. ఇప్పుడు రసాయనాలతో కూడిన రంగులు మార్కెట్లలో దొరుకుతున్నాయి.

Recommended Video

Holi 2021 : Holi Celebrations In Hyderabad ఆంక్షల నడుమ హోలీ సంబరాలు!! | Oneindia Telugu
బీకేర్‌ఫుల్

బీకేర్‌ఫుల్


రంగులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాపర్ సల్ఫైట్, మెర్క్యూరీ సల్ఫైట్‌తో పాటు ఇతర రసాయనాలతో కలిపిన రంగులను వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల అనారోగ్యానికి గురవుతారు. కళ్లలో పడితే కంటి చూపు పోయే అవకాశం ఉందని, సహజ రంగులతో పండుగను నిర్వహించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సో అందరూ.. ఉత్సహంగా హోలి పండగ నిర్వహించుకొండి.. కానీ తగిన జాగ్రత్తలను మాత్రం తీసుకొండి.

హోళి విశిష్టత

హోళి విశిష్టత

హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనం అవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఫాల్గుణ పౌర్ణమి రోజున కాముని పున్నమి పేరుతో సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

English summary
hyderabad city ready to celebrate holi festival. tomorrow holi festival started.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X