హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కాటు: వైరస్ సోకి కానిస్టేబుల్ మృతి, డిపార్ట్‌మెంట్‌లో తొలి మరణం, డీజీపీ సంతాపం..

|
Google Oneindia TeluguNews

కరోనా రక్కసి కానిస్టేబుల్‌ను కబళించింది. వైరస్ సోకి కాప్ చనిపోవడంతో వారింట్లో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాప్ మృతిపై డీజీపీ మహేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌తో కానిస్టేబుల్ చనిపోవడంతో పోలీసు డిపార్ట్‌మెంట్‌ను కలవరానికి గురిచేస్తోంది. అతనితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు పోలీసువాఖలో ఏడుగురుకి వైరస్ సోకగా.. ఇది కరోనా తొలి మరణంగా నమోదయ్యింది.

 ఎస్ఐ సహకారం: కరోనా స్పెషల్ డీఎస్పీనంటూ అక్రమాలకు తెగబడ్డ వ్యక్తి అరెస్ట్ ఎస్ఐ సహకారం: కరోనా స్పెషల్ డీఎస్పీనంటూ అక్రమాలకు తెగబడ్డ వ్యక్తి అరెస్ట్

కరోనా కాటు..

కరోనా కాటు..


నల్గొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు కాగా.. కుల్సుంపురా పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 2007 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్.. గత 15 రోజుల నుంచి పురణాపూల్ చెక్ పోస్ట్ వద్ద టూ వీలర్స్ చెక్ చేస్తున్నారు. ద్వి చక్ర వాహనాలు చెక్ చేసి సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అతనికి వైరస్ సోకి ఉంటుందని పేరు చెప్పడానికి ఒక అధికారి మీడియాకు తెలిపారు.

టెంపరేచర్ పెరిగి

టెంపరేచర్ పెరిగి


కరోనా వైరస్ వ్యాపించడంతో.. అతను ఇబ్బంది పడ్డాడు. టెంపరేచర్ పెరగడంతో అతనిని ఈ నెల 13వ తేదీన ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. రెండురోజులకు అతనికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అతను వైద్యానికి స్పందించడం లేదని, బుధవారం రాత్రి 10.30 గంటలకు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. చనిపోయాక కూడా అతని రక్త నమూనాలు సేకరించామని.. కరోనా వైరస్ వల్లే చనిపోయాడని వైద్యులు తెలిపారు.

Recommended Video

David Warner Wishes Jr.NTR On His Birthday By Dancing 'Pakka Local' Song
విషాదఛాయలు

విషాదఛాయలు


కానిస్టేబుల్ చనిపోవడంతో అతను నివాసం ఉండే వనస్థలిపురం, సొంత ఊరు నల్గొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం కోవిడ్ 19 ప్రొటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి మృతి పట్ల డీజీప మహేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం, పదిరోజుల నుంచి రోజుకి 40కి తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 1661కి చేరగా.. మృతుల సంఖ్య 40కి చేరుకుంది.

English summary
37-year-old constable dayakar reddy in Hyderabad died due to the novel coronavirus on Wednesday night, making it one of the first from the state's police department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X