ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ బాగా కాస్ట్‌లీ గురూ!!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలలో ఒకటి తెలంగాణ రాజధాని, ఒకప్పటి భాగ్యనగరం హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువని సర్వే నివేదికలో వెల్లడైంది. అయితే మన దేశంలో ఇంకా కాస్ట్లీ సిటీలు కూడా ఉన్నాయని సర్వే నివేదిక తేల్చింది. అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్ 202 స్థానం దక్కించుకుంది.

మెర్సర్స్ 2023, జీవన వ్యయ సర్వే నివేదికలో హైదరాబాద్ బాగా కాస్ట్ లీ సిటీగా స్థానం దక్కించుకుంది. అంతర్జాతీయంగా వివిధ నగరాలలో నిర్వహించిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో నగరంలోని వసతి, రవాణా సౌకర్యాలు, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నివేదికను రూపొందించారు.

Hyderabad is very expensive.. hyderabad most costliest city in worlds ranking

ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలలో జరిపిన సర్వేలో భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాలుగా ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కలకత్తా, పూణే, హైదరాబాద్ నగరాలు చోటు దక్కించుకున్నాయి. భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ 169 ర్యాంకులో, చెన్నై 184, బెంగళూరు 189, పూణే 213, కలకత్తా 211, హైదరాబాద్ 202 స్థానాల్లో నిలిచాయి.

ఇదిలా ఉంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలలో హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సర్వే నివేదిక ఆధారంగా విదేశీ మల్టీనేషనల్ కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలంటే భారతదేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వ్యయాల పరంగా అనుకూలమని నివేదిక తెలిపింది.

మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో తక్కువ ఖరీదైన నగరాల జాబితాలో పాకిస్తాన్ లోని కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి. ఇదిలా ఉంటే అత్యంత ఖరీదైన నగరాలలో మొదటి స్థానంలో ఉన్న 35 నగరాలలో ముంబై, ఢిల్లీ నిలిచాయి. ఆసియా నగరాలలో ముంబై స్థానం గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం తగ్గి 27కు చేరుకుంది. ముంబై తో పోలిస్తే చెన్నై, కలకత్తా, హైదరాబాద్, పూణే లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+