• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భారీ వర్షాలపై కేటీఆర్ కీలక అప్‌డేట్ - ఇంకో రెండు రోజులు - ముంపు బాధితులకు మంత్రి భరోసా

|

భారీ వర్షాలకు భాగ్యనగరం చిరుగుటాకులా వణికిపోయింది. సిటీ సహా శివారు ప్రాంతాల్లో వందేళ్ల తర్వాత అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి(32 సెం.మీ) వర్షం కురవడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండగా, లోటత్తు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం, వరద పరిస్థితులపై బుధవారం కీలక సమీక్ష నిర్వహించిన అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

వర్షాలు: సీఎం జగన్ ప్రయారిటీ దీనికే - తెలంగాణ ఎఫెక్ట్ - చిత్తూరులో విచిత్ర పరిస్థితి - కీలక ఆదేశాలు

కేటీఆర్ అడ్డగింత..

కేటీఆర్ అడ్డగింత..

హైదరాబాద్ లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఓల్డ్ సిటీతోపాటు బైరామల్‌గూడ, హబ్సిగూడ, రామాంతపూర్, ముసారాంబాగ్‌ తదితర ఏరియాలకు వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొన్ని మంత్రి కేటీఆర్‌ను స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక కార్పొరేటర్లు, నేతలెవరూ పట్టించుకోవడం లేదంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. సాగర్‌ రోడ్డుపై ముంపు బాధితులు బైఠాయించారు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్న కేటీఆర్.. వారి సమస్యలను ఓపికగా విన్నారు.

లోకల్ నేతలపై ఆగ్రహం..

లోకల్ నేతలపై ఆగ్రహం..

కేటీఆర్ పర్యటించిన ముందు ప్రాంతాల్లో పలు చోట్ల స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో ప్రజలకు నేతలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని బాధితులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. తక్షణమే అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే, కార్పొరేటర్లకు మంత్రి సూచించారు. అదే సమయంలో..

జస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

వానలు తగ్గే సూచన లేదు..

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పించిన మంత్రి కేటీఆర్.. రాబోయే రెండు రోజుల పాటు మరింత అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికిప్పుడు వానలు త‌గ్గే సూచ‌న లేదని, ప్రస్తుతం పున‌రావాస కేంద్రాల్లో ఉన్నవాళ్లంతా మరో రెండు రోజుల పాటు కూడా అక్క‌డే ఉండాల‌ని ముంపు బాధితుల‌కు కేటీఆర్ సూచించారు. బాధితులంద‌రికి వైద్య ప‌రీక్ష‌లు చేయించి, మందులు ఇస్తూ, భోజనం పెడుతున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో మందులు, దుప్ప‌ట్లు పంపిణీ చేపట్టామన్నారు. అంతేకాదు, బాదితులకు న‌ష్ట ప‌రిహారం కూడా చెల్లిస్తామ‌ని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు.

పెరుగుతోన్న మరణాలు..

పెరుగుతోన్న మరణాలు..

హైదరాబద్ సిటీలో రికార్డు స్థాయి వర్షానికి వరద పోటెత్తింది. అన్ని జలాశయాలు నిండిపోవడంతో మూసీలోకి భారీగా వరద చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇళ్లు, చెట్లు కూలడం తదితర ఘటనల్లో మృతుల సంఖ్య బుధవారం నాటికి 15కు పెరిగింది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. అత్యవసర సేవల కోసం 040-21111111, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ 90001 13667, 97046 01866, జీహెచ్ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ 94408 13750, ఎన్డీఆర్ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

English summary
Minister KTR visited flood affected areas in Hyderabad. along with ministers and mim leaders ktr on Wednesday visited several areas in hyderabad and learned about the problems of the people. Speaking to media KTR said, We have to be vigilant for the next two days and there is no sign of rain falling. in some areas Minister KTR was blocked by locals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X