హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతంలో 30 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగర ప్రజలకు మరో ట్రాఫిక్ అలర్ట్. నగరంలోని చింతల్ పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించే ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే మంచింది. ఎందుకంటే.. చింతల్ మార్కెట్ వద్ద ట్విన్స్ బాక్స్ కల్వర్టుపై జీహెచ్ఎంసీ పనుల కోసం నెలరోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నేడు అంటే శుక్రవారం నుంచి మే 28, 2023 వరకు 30 రోజుల పాటు పనులు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు. ఈ క్రమంలో రద్దీని నివారించడానికి తగిన ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు.

చింతల్ మెయిన్ రోడ్ నుంచి పద్మానగర్ రింగ్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ ఎల్లమ్మ దేవాలయం-ఎడమ వైపు-వాణి నగర్-కుత్బుల్లార్ గ్రామం వద్ద మళ్లించబడుతుంది. పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మాణిక్యనగర్ కమాన్-ఢిల్లీ పబ్లిక్ స్కూల్-పాండు విగ్రహం-చింతల్ ప్రధాన రహదారిపై మళ్లిస్తారు.
మరోవైపు, పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్ ఫైన్ చికెన్ మార్కెట్-అంబేద్కర్ నగర్ రోడ్-అంబేద్కర్ విగ్రహం-కుడివైపు-రాంరెడ్డి నగర్-రెయిన్‌బో హైస్కూల్ ఐడీపీఎల్ మెయిన్ రోడ్ వద్ద మళ్లిస్తారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రయాణికులు.. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో అటువైపుగా వెళ్లే వాహనదారులు తమకున్న ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి.












Click it and Unblock the Notifications