New Year 2024: 4.5 లక్షల కేజీల చికెన్ కుమ్మేసిన హైదరాబాదీలు..

డిసెంబర్ 31 నైట్ అంటే ఏం గుర్తుకు వస్తుంది. చికెన్, మటన్, మందు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో ముక్కతోనే కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతారు. ముక్కతో పాటు మందు సుక్క ఇక్కడ మస్ట్ గా మారింది. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో తెలంగాణలో చికెన్, మటన్ కు భారీగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆదివారం ఉదయం నుంచి చికెన్, మటన్, చేపల షాపుల్లో రద్దీ కనిపించింది.

హైదరాబాద్ లో సాధారణ రోజుల్లో కంటే ఆదివారం ఒక్కరోజే మటన్, చికెన్, చేపల విక్రయాలు భారీగా పెరిగియి. ఆదివారం భారీగా నాన్ వెజ్ తిన్నారు. హైదరాబాద్ లో నాన్ వెజ్ అమ్మకాలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్​ విక్రయించగా.. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడు పోయింది. ప్రస్తుతం చికెన్​అమ్మకాలకు మంచి వాతావరణం ఉందని, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చికెన్ ధరలు భాగానే ఉన్నాయి.

Hyderabadis eat 4.5 lakh kg of chicken for New Year celebrations

4.5 లక్షల కేజీలకు కిలోకు రూ. 230 చొప్పున 10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీరంగ వ్యాపారులు చెబుతున్నారు. మటన్ కూడా భారీగానే అమ్ముడు పోయింది. దాదాపు 25 నుంచి 30 వేల క్వింటాళ్ల మటన్ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. మటన్ ​ధర ప్రస్తుతం రిటైల్​మార్కెట్​లో కిలో రూ. 800 - రూ. 900 వరకు పలుకుతున్నాకొనుగోలు చేస్తున్నారు. రామ్ ​నగర్​, జియాగూడ, సికింద్రాబాద్​ మోండా మార్కెట్​లోనూ ఫిష్​ విక్రయాలు భారీగానే జరిగాయి.

చేపలు 2 వేల క్వింటాళ్ల వరకు అమ్ముడుపోయినట్టు హోల్​సేల్​ వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఈసారి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ హ్యాపీ న్యూ ఇయర్​సెలబ్రేషన్స్ పిల్లలు, పెద్దలు, యూత్ , ఫ్యామిలీస్ అంతా కలిసి ఎంజాయ్ చేశారు. లిక్కర్ కు సంబంధించి వివరాలు రావాల్సి ఉంది. న్యూ ఇయర్ వేళ పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+