ప్రపంచకప్ లో భారత్ -పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్: హైదరాబాద్ వేదికగా, కానీ..!?
ICC World cup 2023:హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. హైదరాబాద్ వేదికగా ప్రపంచ కప్ లో హై ఓల్టేజ్ మ్యాచ్ కు నిర్ణయం జరిగింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ప్రపంచ కప్ జరగనుంది. అందులో పాకిస్థాన్ పాల్గొనటం పైన కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా పాకిస్థాన్ ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొనటం ఖరారైంది. పాకిస్తాన్ భారత్ లో ఆడే మ్యాచ్ లకు ఉన్న ప్రత్యేకతల కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ మ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రపంచ కప్ లో కీలక మ్యాచ్:ప్రపంచ కప్ కోసం అక్టోబర్ లో మెన్ ఇన్ గ్రీన్ పాకిస్తాన్ భారత్ కు రానుంది. ఆసియా కప్ నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగా ప్రపంచ కప్ కు ఆడేందుకు భారత్ కు వచ్చే విషయంలో కొంత కాలంగా పాక్ వైఖరి సందిగ్దతలో పడింది. చిరవకు ప్రపంచ కప్ కావటంతో పాల్గొనాలని నిర్ణయించింది. అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్ 2023 ఆరంభం కానుంది. నవంబర్ 19న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ తిరిగి అదే స్టేడియం లో జరగనుంది. ఐపీఎల్ తరువాత అధికారికంగా షెడ్యూల్ ప్రకటించనున్నారు.

హైదరాబాద్ వేదికగా భారత్ -పాక్ మ్యాచ్:ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 15న నిర్ణయించిన షెడ్యూల్ మేరకు అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ వేదిక విషయంలో పీసీబీకి కొన్ని అభ్యంతరాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై తమ ఆందోళనల్ని తెలియజేసేందుకు పీసీబీ చీఫ్ నజామ్ సేథీ దుబాయ్‌లోని ఐసీసీ కార్యాలయాన్ని సంప్రదించినట్లు సమాచారం. అహ్మదాబాద్ లో ఆడేందుకు పీసీబీ విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారగ్ తో పాక్ మ్యాచ్ ను హైదరాబాద్ లో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు ప్రాధమిక సమాచారం.
నిర్వహణపై కసరత్తు:పాకిస్థాన్ ఆడే మ్యాచ్ లను దక్షిణాదిలోని ముఖ్య నగరాలైన చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో జరగనున్నాయి. అక్టోబర్ లో హైదరాబాద్ లో నిర్వహించటం పైన బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై ప్రచారం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో నెలకొన్న హై ఓల్టేజ్ రాజకీయాల నడుమ ఈ మ్యాచ్ నిర్వహణ పైన అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో..త్వరలోనే హైదరాబాద్ లో భారత్ - పాక్ మ్యాచ్ నిర్వహణ పైన అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరిగితే క్రికెట్ ఫ్యాన్స్‌కి అసలైన మజా ప్రత్యక్షంగా అందనుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications