ట్రాఫిక్ పోలీసుల జబర్దస్తీ..! చలాన్లు చెల్లించకపోతే వాహనం సీజ్...!
మీ వాహనం పై వేల రుపాయాల ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా..?వాటిని డబ్బులు ఉన్నప్పుడు చెల్లిద్ధాం అని భావిస్తున్నారా....? అయితే... మీ ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టండి. వెంటనే వెళ్లి పెండింగ్ ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించండి .. ఒకవేళ పోలీసులు చేతికి చిక్కితే మాత్రం మీరు డబ్బులు చెల్లించేవరకు వాహనం జప్తు చేయడం ఖాయం.. ఎందుకంటే పెండింగ్ చాలన్ల కోసం పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. కోట్ల రుపాయల పెండింగ్ చలాన్లను వసూలు చేయడమే ద్యేయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.

ఆధునిక సాంకేతికతతో వాహానాలపై జరిమానాలు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల్లో అక్రమాలు తగ్గించేందుకు తీసుకువచ్చిన ట్రాఫిక్ చలాన్ల టెక్నాలజీ ఇప్పుడు వినియోగదారులకు శాపం అవుంతోంది. గతంలో ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు ,ఎక్కడపడితే అక్కడ తమ ఇష్టాసారంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమాన విధించి వసూలు చేసేవారు. అయితే ఆ వసూళ్లు అనేక విమర్శలను ఎదుర్కోన్నాయి.దీంతో గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ జరిమానాలను విధించేందుకు పోలీసులు నయా సాంకేతికతను తీసుకువచ్చారు. కేమేరాలు, ఫోటోలతో జరిమానాలు విధించి ఇంటికే నేరుగా పంపుతున్నారు.

పేరుకుపోతున్న పెండింగ్ చలాన్లు, ఇయర్‌లో 100కోట్లు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు తమ కెమేరాల్లో బంధిస్తున్నారు. ఎక్కువగా హెల్మెంట్ లేకపోవడం, కారు సీటు బెల్ట్ పెట్టకోకపోవడంతోపాటు సిగ్నల్స్ జంపింగ్, రాంగ్ పార్కీంగ్ లాంటీ ఉల్లంఘనల్లో నేరుగా పోలీసులు ఆయ సంధర్భాల్లో ఫోటోలు తీసీ వినియోగాదారులకు తెలియకుండానే వారి అడ్రస్‌కు పంపుతున్నారు. రోజు వేలాదీ రుపాయలను జరిమానల రూపంలో వాహనదారులపై విధిస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం సుమారు 150 కోట్ల రుపాయల వరకు విధిస్తున్నారు. కాగా గత 2018లో అయితే ఈ జరిమానాలు ఏకంగా 200 కోట్ల రుపాయల వరకు చేరుకున్నాయి.

పెండింగ్ చలాన్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌లు...
అయితే పోలీసులు ఓవైపు జరిమానాలు విధించి చేతులు దులుపుతున్న నేపథ్యంలోనే వాహానాదారులు వాటిని చెల్లించే పరిస్థితి కనింపించడం లేదు. జరిమానాలను మీసేవ, పోస్టాఫిసుతో పాటు , ట్రాఫిక్ బూత్‌ల్లో జరిమానాలు చెల్లించేవిధంగా చర్యలు చేపట్టారు.అయితే ట్రాఫిక్ అధికారులు భావించినట్టుగా జరిమానాలు మాత్రం వసూలు కావడంలేదు. సంవత్సరంలో విధించిన జరిమానల్లో కేవలం 40 శాతమే వసూలు అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.దీంతో జరిమానాలు పేరుకుపోతున్నాయి. చేసేదీలేక చలాన్ల వసూలు కోసం నేరుగా వాహనాదారులను రోడ్డుపైనే ఆపి జరిమానలు కక్కిస్తున్నారు. లేదంటే వాహానాన్ని జప్తు చేసి పోలీస్ స్టేషనుకు తరలిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరి ఎక్కువగా ఉంటే కోర్టుకు సైతం తీసుకెళుతున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications