Hyderabad: వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు..
తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో వాహనదారులకు పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర డీజీపీ రవిగుప్త వాహనదారుల జాగ్రత్తగా ఉండాలని కోరారు. వర్షాలు పడినప్పుడు వర్షాలు కురిసినప్పుడు మ్యాన్ హెల్స్ తెరవొద్దని చెప్పారు. సంబంధించి కార్మికులు మాత్రమే మ్యాన్ హోల్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారని పేర్కొన్నారు. వర్షం కురిసినప్పుడు వెహికిల్స్ స్కిడ్ అవుతాయని చెప్పారు. ఈ క్రమంలో వాహనాలు జారి పడతాయి.
ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ వాహనాల టైర్ల గ్రిప్ /థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవలన్నారు. టైర్ల గ్రిప్ బాలేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు. వర్షం కురుస్తున్నపుడు పరిమిత వేగంతో ప్రయాణించటం మంచిదన్నారు.

వాహనం ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోడం ముఖ్యమన్నారు. బ్రేక్స్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నారు. ఎప్పుడైనా అవసరం వస్తే మీ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
అత్యవసర సమయాల్లో #Dial100 కి కాల్ చేసేలా మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోలన్నారు. మీ కుటుంబ భద్రత దృష్ట్యా ఈ సూచనలు ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.












Click it and Unblock the Notifications