హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ మానవ అక్రమరవాణా ముఠా... 17 మంది అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది. హైదరాబాద్ నుండి ఇతర దేశాలకు నకిలీ వీసాలతో పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా దందా జరుగుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తరచూ నకిలీ వీసాల తో పట్టుబడుతున్న ప్రయాణికులను గమనిస్తే ఎంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టైంది.హైదరాబాద్‌లో మనుషులను అక్రమంగా రవాణా చేసే ఈ అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు . నకిలీ వీసా, పాస్‌పోర్టులతో మానవ అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 200 నకిలీ పాస్‌పోర్ట్‌లు, వీసాలు స్వాధీనం చేసుకున్నారు. 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణా రాష్ట్రంలో నకిలీ వీసాలకు కొదువే లేదని మొన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాలతో పట్టుబడిన ముఠా తేల్చింది. ఇక ఎయిర్ పోర్ట్ లో అను నిత్యం ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నా నకిలీ వీసాలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మొన్న అధికారులు పట్టుకున్న వారిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది మహిళలు నకిలీ వీసాలతో అడ్డంగా బుక్కయ్యారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు..ఈ నకిలీ వీసాల వెనుకున్న వారు ఎవరు..ఎక్కడ ఈ వీసాలను తయారుచేశారు అన్న కూపీలాగినట్టు తెలుస్తుంది. దీంతో సైబరాబాద్ పోలీసులు మొత్తానికి నకిలీ వీసాలతో మానవ అక్రమ రవాణాకు పాల్పడే అంతర్జాతీయ ముఠాను పట్టుకున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications