హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

International yoga day2022: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ యోగా డే వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగా ఫర్ హ్యుమానిటీ అనే థీమ్ తో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

పరేడ్ గ్రౌండ్స్ లో యోగా డే వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్స్ కు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చే మార్గంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన సందర్భంగా యోగా గురించి మాట్లాడారు. యోగా వల్ల యూనిటీ, ఇంటిగ్రిటీ, శరీరానికి ఆరోగ్యం వస్తుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత జనరేషన్ కూడా యోగాను చెయ్యాలని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.

యోగాకు కులం, మతం వంటి పరిమితులు లేవు., అందరూ యోగా చెయ్యాలి: వెంకయ్య నాయుడు

యోగా చేయడం వల్ల ఆత్మశక్తిని ఏకం చేయవచ్చని, యోగ అంటే ఇంద్రియాలని ఏకం చేయడం అని వెంకయ్య నాయుడు తెలిపారు. యోగా ప్రాచీనమైనదే అయినప్పటికీ దానికి ఎటువంటి కాలదోషం లేదని, అన్ని కాలాలలోనూ యోగాను చేయవచ్చని పేర్కొన్నారు. యోగాకు కులం, మతం వంటి ఎటువంటి హద్దులు లేవని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రసిద్ధం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, యోగా ని కనుగొన్న మన పూర్వీకులకూ వెంకయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు.

ఆరోగ్యమే మహా భాగ్యం ., అది యోగాతోనే సాధ్యం : ఉపరాష్ట్రపతి

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆరోగ్యంగా ఉంటే మహా భాగ్యం సాధ్యమవుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. యోగా చేసి దేశాన్ని ఆరోగ్యవంతం చేద్దామని, యోగసాధనతో ప్రపంచ శాంతి చేకూరుతుందని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. యోగా స్ట్రెస్ ను, టెన్షన్ ను పోగొడుతుందని పేర్కొన్న వెంకయ్య నాయుడు ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో యోగా మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆరోగ్యం కోసం అందరూ యోగా చెయ్యాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఇదిలా ఉంటే భారత ఉపరాష్ట్రపతి తో పాటు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నటుడు అడవి శేషు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బిజెపి నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగాను తప్పనిసరిగా చేయాలని సూచించారు. యోగాను అందరూ అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్న మంత్రి కిషన్ రెడ్డి, పాఠశాలల్లో యోగా ను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా చేయడం ఎంతో ఉత్తమమని కిషన్ రెడ్డి వెల్లడించారు.

English summary
Vice President Venkaiah Naidu and Union Minister Kishan Reddy participated in the International Yoga Day celebrations held at the Parade Grounds in Hyderabad. They suggested that everyone do yoga for health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X