• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తాగుబోతుల‌కు పోలీసుల ఝ‌ల‌క్..! డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే ఉద్యోగం ఫ‌స‌క్..!!

|

హైద‌రాబాద్ : అరె మావా.. ఓ పెగ్ లా..! అరె మావా.. ఓ పెగ్ లా..!! అని పెగ్గుల మీద పెగ్గులు వేస్తే ఓకే..! కాని పీక‌ల దాకా తాగి పోలీసుల‌కు దొరికిపోతేనే అస‌లు స‌మ‌స్య మొద‌లౌతుంది. అస‌లు స‌మ‌స్య కాదు జీవిత‌కాల స‌మ‌స్య‌లో ఇరుక్కువోవ‌డం ఖాయం..! ఇంత‌కు ముందు తాగి దొరికితే త‌ల్లి దండ్రుల స‌మ‌క్షంలోనో, భార్య స‌మ‌క్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చేవారు పోలీసులు. మ‌హా ఐతే ఫైన్ క‌ట్టించుకుని వ‌దిలేసే వారు. ఇక మీద‌ట అలాంటివి ఏమీ ఉండ‌వ‌ట‌. తాగి దొరికితేపోతే జీవిత‌కాలం క్రుంగి క్రుషించి మ‌నోవేద‌న అనుభ‌వించేలా చ‌ర్య‌లు తీసుకోబోతున్నారు పోలీసులు..!

పెగ్ స‌రాదా..! దూల తీర్చే అవ‌కాశం..!!

పెగ్ స‌రాదా..! దూల తీర్చే అవ‌కాశం..!!

వీకెండ్.. స‌ర‌దాగా రెండు పెగ్గులు వేద్దాం..! స్నేహితుడి బ‌ర్త్ డే..! ఓ రెండు బీర్లు లాగిస్తే పోలా..! ఇలా ఆలోచించే మ‌ద్య‌పాన ప్రియుల‌కు పోలీసులు గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌బోతున్నారు. ఇంట్లో తాగి ఇంట్లో తొంగుంటే సేఫ్..! అలాగే ఇంకెక్క‌డైనా తాగి అక్క‌డే నైట్ ఔట్ చేస్తే ఓకే..! అలా కాకుండా ఇంటి వైపు ప‌రుగులు పెట్టామో., మ‌ద్య‌లో పోలీసుల‌కు దొరికి పోయామో అంతే సంగ‌తి. ఉన్న‌ది పోయె, ఉంచుకున్న‌ది పోయే అనే ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. ఐనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో అవి ఉన్న నిబంధ‌న‌లే క‌దా..! కొత్త‌గా ఏముంది అనుకుంటున్నారా..? అస‌లు క‌థ ఇక్క‌డే ఉంది.

మెట్రో లో ఉద్యోగాలు..! 80 లక్షలు వసూలు.. అడ్డంగా దొరికిన జంట

తాగి పోలీసుల‌కు దొరికితే చీక‌టే..! పోలీసుల చర్య‌ల‌తో జీవ‌తం నాశ‌న‌మే..!!

తాగి పోలీసుల‌కు దొరికితే చీక‌టే..! పోలీసుల చర్య‌ల‌తో జీవ‌తం నాశ‌న‌మే..!!

ప‌ని ఒత్తిడిని అదిగ‌మించడానికి, ఇత‌ర‌ స‌మ‌స్య‌ల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం పొందాడానికి అంద‌రికి అందుబాటులో ఉండే మెడిసిన్ మద్యం. దిట్టంగా రెండు పెగ్గులు వేసి మ‌త్తులో తూలితే ఆ స్వ‌ర్గం వేరుంటుంద‌ని భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు. అలా బాద‌ల‌ను మ‌ర్చిపోవ‌డానికి విస్కీనో, బ్రాందీనో, ర‌మ్మునో న‌మ్ముకున్న వారికి దిమ్మ‌దిరిగే స‌మాధానం చెప్తేందుకు పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యే ప్ర‌ణాళిక‌తో ముందుకొస్తున్నారు. తాగి పొర‌పాటున దొరికిపోయారో జీవితానికి శుభం కార్డు ప‌డ్డ‌ట్టే అని నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. అంత ఘాటుగా ఉండ‌బోతున్నాయి పోలీసుల చ‌ర్య‌లు.

తాగుబోతుల‌పై పోలీసుల కొత్త చ‌ర్య‌లు..! దొరికితే అంతే సంగ‌తులు..!!

తాగుబోతుల‌పై పోలీసుల కొత్త చ‌ర్య‌లు..! దొరికితే అంతే సంగ‌తులు..!!

ప్ర‌భుత్వ ఉద్యోగుల ద‌గ్గ‌ర‌నుండి ప్ర‌యివేటు ఉద్యోగుల వ‌ర‌కు అంద‌ద‌రికి ఒక‌టే శిక్ష‌. తాగి గ్రైవింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డిదే ఈసారి ఫైన్ క‌ట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. త‌ల్లిదండ్రుల‌ను పిల‌వాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కోర్టుకు హాజ‌రు కావాల్సిన అవ‌స‌రం అస‌లు ఉండ‌దు. భార్య స‌మ‌క్షంలో కౌన్సిలింగ్ కు వెళ్లి గిల్టీ గా ఫీల‌వ్వాల్సిన ప‌ని ఉండ‌దు. పోలీసులు తీసుకునే ఆ చ‌ర్య‌ల‌కు తోడు ప‌నిచేసే కార్యాల‌యాల్లో ఉన్న‌తాదికారుల నిర్ణ‌యం జీవితాన్ని చీక‌టిమ‌యం చేయ‌డం ఖాయం. దూర‌ప్రాంతాల నుండి వ‌చ్చి ఉద్యోగం మీద ఆధార ప‌డి జీవ‌నం నెట్టుకొస్తున్న వారైతే పెట్టే పేడా స‌ర్దుకుని సొంతూర్ల‌కు వెళ్లి పోవ‌చ్చు.

ఉద్యోగులు తాగి దొరికితే యాజ‌మాన్యాల‌కు ఫిర్యాదు..! ఉద్యోగం పోవ‌డం ఖాయం..!!

ఉద్యోగులు తాగి దొరికితే యాజ‌మాన్యాల‌కు ఫిర్యాదు..! ఉద్యోగం పోవ‌డం ఖాయం..!!

పొర‌పాటున డ్రంక్ ఆండ్ డ్రైవ్ లో పోలీసుల‌కు దొరికిపోతే ఇక ఉద్యోగ జీవితానికి బ్రేకులు ప‌డ్డ‌ట్టే..! చిన్న చిత‌కా ఉద్యోగ‌స్తుల ద‌గ్గ‌ర‌నుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వ‌ర‌కు ఎవ‌రు తాడి డ్రైవ్ చేస్తూ పోలీసుల‌కు దొరికితే వారి ఉద్యోగం పోవ‌డం ఖాయంగా తెలుస్తోంది. తాగి దొరికిపోయిన ఉద్యోగుల వివ‌రాలను ఆయా కంపెనీల ఉన్న‌తాదికారుల‌కు పంపించ‌డ‌మే కాకుండా తాగుబోతు ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌ల‌కండ‌ని పోలీసు ఉన్న‌తాదికారులు కెంపెనీల హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయ‌డం పోలీసు చ‌ర్య‌ల్లో కొత్త కోణం. ఇక తాగి ఎవ‌రు ప‌ట్టు ప‌డ్డా వారి ఉద్యోగాల‌కు ఎస‌రు త‌ప్ప‌ద‌న్న మాట‌. తాగుబోతు ఉద్యోగి గురించి కంపెనీల యాజ‌మాన్య‌ల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో పాటు స‌ద‌రు తాగుబోతు ఉద్యోగిని ఉద్యోగం నుండి తీసెయ్యాల‌ని స్వ‌యంగా పోలీసులే లేఖ‌లు రాయ‌డం ఉద్యోగుల ప‌ట్ల శ‌రాఘాతంగా మార‌బోతోంది.

తాజాగా గ‌చ్చిబౌలి లోని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మ‌ద్యం తాగి ప‌ట్టుబ‌డితే స‌ద‌రు కంపెనీ హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ కి స‌మాచారం ఇచ్చింది పోలీసు శాఖ‌. దీంతో ఆ ఉద్యోగి పై చ‌ర్య‌లు తీసుకునేందుకు ఉపక్ర‌మించింది ఆ కెంప‌నీ. ఇలాంటి ప్ర‌యోగం మంచి ఫ‌లితాలు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న పోలీసులు ఇక మీద‌ట తాగుబోతు ఉద్యోగుల ప‌ట్ల ఆయా కంపెనీల‌కు ఫిర్య‌దు చేయాల‌ని పోలీసులు నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. సో.. తాగి డ్రైవ్ చేస్తే ఉద్యోగం పోవ‌డం ఖాయ‌మ‌న్న మాట‌. మ‌ద్యం ప్రియులారా..! త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!!

English summary
Hyderabad Police had warned the people not to drive their vehicle while drunk. If they are caught in drunken drive test, a letter would be sent to the victims office HR department and he might loose the job, said police official. This rule is applicable for all. i.e From govt employees to Private employees clarified the police department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X